Kumram Bheem Asifabad: ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:37 PM
వాంకిడి, అక్టోబరు 10 (ఆంధ్ర జ్యోతి): ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జీ శ్యాంనాయక్ పేర్కొన్నారు.
వాంకిడి, అక్టోబరు 10 (ఆంధ్ర జ్యోతి): ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జీ శ్యాంనాయక్ పేర్కొన్నారు. మండలకేంద్రంలోని శివా లయం, అంబేద్కర్ భవన్, చర్చి, శివకేశవనగర్‌లలో మంజూరైన షెడ్డు నిర్మాణపనులను ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని దేవాలయాల్లో భక్తులు, ప్రజలసౌకర్యార్థం ఆలయాల ముందు రూ.3లక్షలతో షెడ్డునిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఆయా కార్యక్ర మాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్నులే మెంగాజీ, శివాలయకమిటీ చైర్మన్ గాదేప్రవీణ్, లక్ష్మణ్ సేవాసదన్ సంస్థ చైర్మన్ గాదేఅవినాష్, సర్పంచ్ సతీష్, ఉపసర్పంచ్ దీపక్‌ముండే, పీఏసీఎస్ చైర్మన్ జాబిరే పెంటు, ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్, సమతా సైనిక్‌దళ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి దుర్గం సందీప్, మండల నాయకులు, తది తరులు పాల్గొన్నారు.