Share News

Kumram Bheem Asifabad: ప్రాథమిక ఉపాధ్యాయులే విద్యావ్యవస్థకు మూలస్తంభాలు

ABN , Publish Date - Jul 13 , 2026 | 11:51 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఉపా ధ్యాయులే విద్యావ్యవస్థకు మూల స్తంభాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు.

Kumram Bheem Asifabad:  ప్రాథమిక ఉపాధ్యాయులే విద్యావ్యవస్థకు మూలస్తంభాలు

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఉపా ధ్యాయులే విద్యావ్యవస్థకు మూల స్తంభాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. సోమవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పట్టణం లోని జడ్పీబాలికల పాఠశాలలో నిర్వహించిన మూడురోజుల జిల్లాస్థాయి సమగ్ర ఉపా ధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల భవిష్య త్‌కు బలమైన పునాది వేసేది ప్రాథమికవిద్య అన్నారు. ప్రతిచిన్నారిలో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించే గొప్పబాధ్యత ప్రాథమిక ఉపాధ్యాయులపై ఉందన్నారు. శిక్షణలో నేర్చుకున్న ఆధునిక బోధన పద్ధతులను తర గతి గదిలో సమర్థవంతంగా అమలుచేసి ప్రతి విద్యార్థి అభ్యసన ఫలితాలను మెరుగుపరిచేందుకు కృషిచేయల న్నారు. కార్యక్రమంలో డీఈవో సచ్చితానందచారి, కోఆర్డి నేటర్లు శ్రీనివాస్‌, కోర్సుఇన్‌చార్జి ప్రకాష్‌, డీఆర్పీలు, ఎమ్మార్పీలు పాల్గొన్నారు.

విద్యార్థులు ఉన్నత శిఖరాలను

అదిరోహించాలి

ఆసిఫాబాద్‌ : విద్యార్థులు భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలను అదిరోహించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. సోమవారం కలెక్టర్‌లో జిల్లాలో తైక్వాండో, కరాటే విభాగాలలో గిన్నిస్‌ బుక్‌ఆఫ్‌ రికార్డ్సు సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, పథకాలను ఆమె అంద జేశారు. కాగజ్‌నగర్‌ పట్టణంలోని సెయింట్‌క్లారిటీ స్కూల్‌కు చెందిన కె నవినీత్‌ చంద్ర, ఫాతీమ కాన్వెంట్‌ స్కూల్‌ విద్యార్థులతోపాటు త్రినాథ్‌, అశ్విక్‌ యాదవ్‌ గిన్నిస్‌ బుక్‌ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సర్టిఫికెట్లు, మెడల్స్‌ను అందుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తైక్వాండో, కరాటే రంగాలలో అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లాపేరును ప్రపంచవేదికపై నిలిపినందుకు వారిని అభినందించారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో అశ్వక్‌అహ్మద్‌, ఖేలో ఇండియా కోచ్‌ రాజేష్‌, తైక్వాండో, కరాటే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవి, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆల్బెండజోల్‌ మాత్రలతో

నులి పురుగులను నివారించవచ్చు

ఆసిఫాబాద్‌రూరల్‌ : ఆల్బెండజోల్‌ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చని కలెక్టర్‌ కె హరిత అన్నారు. సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిలా ్లకేంద్రంలోని గిరిజన సంక్షేమబాలికల గురుకుల పాఠశా లలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆమె డీఎంహెచ్‌వో సీతారాంతో కలిసి హాజరై ప్రారంభిం చారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 19సంవత్స రాలలోపు పిల్లలందరికి నులిపురుగుల నివారణ మాత్రలు అందించాలని అన్నారు. మాత్రలు అందించ డంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ, ఆశ, ఆరోగ్య సిబ్బంది కృషిచేయాలని ఆదేశించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని మధ్యాహ్నభోజనం చేశారు. ఈసందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతిరోజు నాణ్యమైన రుచికరమై భోజనాన్ని అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీప్యూటీ డీఎంహెచ్‌వో నాగేంద్ర, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2026 | 11:51 PM