Share News

Kumram Bheem Asifabad: ఎల్‌నినో పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి

ABN , Publish Date - Oct 12 , 2026 | 11:31 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావ పరిస్థితి ఎదుర్కొనేందుకు ముందుస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు.

Kumram Bheem Asifabad: ఎల్‌నినో పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి

ఆసిఫాబాద్‌ రూరల్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావ పరిస్థితి ఎదుర్కొనేందుకు ముందుస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. సోమవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజీవ్‌జాజుతోకలిసి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్రం లోని కలెక్టర్లు, అదనపుకలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులు, సంబంధిత శాఖలఅధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయేరోజుల్లో వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే కరువు పరిస్థి తులు, నీటిఎద్దడి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. వ్యవసాయ ఉద్యానరంగాలపై దృష్టిపెట్టి తక్కు వ సమయంలో చేతికందే ఆరుతడి పంటలపై దృష్టిసారించాలన్నారు. గ్రామీణప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశాలను గుర్తించి పరిష్కారచర్యలు చేపట్టాలన్నారు. అన్నిశాఖలు క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షిస్తూ పరస్పర సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ కెహరిత, అదనపుకలెక్టర్‌ యువరాజ్‌ ముర్మాట్‌, ఉద్యానవన అధికారి నదీం, మార్కెట్‌కమిటీ చైర్మన్‌మంగ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2026 | 11:31 PM