Kumram Bheem Asifabad: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ABN , Publish Date - Oct 12 , 2026 | 11:35 PM
ఆసిఫాబాద్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్య లపై వచ్చే అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీ లించి త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె హరిత అన్నారు.
-ప్రజావాణికి గైర్హాజరైన 30మంది అధికారులకు నోటీసులు
ఆసిఫాబాద్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్య లపై వచ్చే అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీ లించి త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె హరిత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపుకలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్‌తో కలిసి అర్జిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. చింతలమానేపల్లి మండ లం బాబాసాగర్ గ్రామానికి చెందిన మహేందర్ ఆసి ఫాబాద్ బీఈడీ కళాశాలలో బీఈడీ పూర్తి చేయగా టీసీ ఇవ్వటం లేదని తెలిపారు. కెరమెరి మండలం చౌపన్ గూడ గ్రామానికి చెందిన రాము తాను కె ఫారం కొరకు దర ఖాస్తు చేసుకున్నానని జారీచేయాలని అర్జి సమర్పిం చారు. వాంకిడి మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ డెయిరీ ఫాం నిర్మాణానికి దరఖాస్తు చేసుకు న్నానని, గ్రామపంచాయతీ నుంచి ఎన్‌వోసీ ఇప్పించాలని అర్జి సమర్పించారు. కౌటాల మండలం ముత్తంపేట గ్రామానికి చెందిన చైతన్య దివ్యాంగ పెన్షన్ కోసం అర్జి సమర్పించారు. సిర్పూరు(టి) లక్ష్మిపూర్ గ్రామా నికి చెందిన తిరుపతి తన భూమిని ఇతరులు అక్రమంగా పట్టా చేసుకున్నారని ఈ విషయంలో న్యాయం చేయా లని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి సమస్యలను పరిష్కరించేట్టు చూడా లన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి గైర్హాజరైన 30మంది జిల్లాఅధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ప్రతి ప్రభుత్వశాఖ జిల్లా అధికారి తప్పనిసరిగా హాజరు కావాలని సరైన సమాచారం లేకుండా వస్తే చర్యలు తప్పవన్నారు.
ప్రజాసేతు యాప్‌తో ఇంటి నుంచే దరఖాస్తు..
జిల్లాలోని ప్రజలు ప్రజాసేతు యాప్ వాట్సాప్ నంబరు 7569986036కు తమ సమస్యలపై ఇంటి నుంచే సందేశాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ కె హరిత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌లు యువరాజ్ మర్మాట్, డేవిడ్‌తోకలిసి ప్రజాసేతు యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల ప్రకారం ప్రజలకు ప్రభుత్వసేవలను మరింత చేరువ చేయటం ప్రజా సమస్యల పరిష్కార ప్రక్రియను సులభతరం చేయటం ప్రజలకు సమయం ప్రయాణ ఖర్చులు ఆదాయం చేయటం లక్ష్యంగా ప్రజాసేతు యాప్‌ను ప్రారంభించా మన్నారు. ప్రజలు ఇంటి వద్ద నుంచి తమ సమస్యలపై ప్రజాసేతు యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలి పారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వేణుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.