Share News

Kumram Bheem Asifabad: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ABN , Publish Date - Sep 07 , 2026 | 11:42 PM

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థా యిలో పరిశీలించి త్వరగా పరి ష్కరించాలని అదనపుకలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు.

Kumram Bheem Asifabad:  ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థా యిలో పరిశీలించి త్వరగా పరి ష్కరించాలని అదనపుకలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. సోమవారం కలె క్టరేట్‌లో డీఆర్వో వేణుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తుల ను స్వీకరించారు. జైనూరు మం డలం ఊషేగాం గ్రామానికి చెందిన కళాబాయి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు. కాగ జ్‌నగర్‌ మండలం కోయవాగు గ్రామానికి చెంది న అరుణ తనకు ఒంటరి మహిళ పింఛన్‌ మంజూరు చేయాలని దరఖాస్తుచేశారు. రెబ్బెన మండలం వంకులం గ్రామానికి చెందిన పోచం తన పేరిటగల పట్టాభూమి ఆన్‌లైన్‌లో నమో దు చేయాలని అర్జీసమర్పించారు. చింతలమానేపల్లి మండలం బూరేపల్లి గ్రామా నికి చెందిన భగవాన్‌ తనకు చెందిన పట్టాభూ మిని వేరొకరి పేరిట నమోదయినందున సవ రించి తనపేరిట నమోదుచేయాలని దరఖాస్తు చేశారు.అదనపుకలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజా వాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్క రించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Sep 07 , 2026 | 11:42 PM