Kumram Bheem Asifabad: ప్రజావాణి ధరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 03 , 2026 | 11:54 PM
ఆసిఫాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ప్రజా వాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీ లించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకొవాలని
ఆసిఫాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ప్రజా వాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీ లించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకొవాలని కలెక్టర్ హరిత అన్నారు. సోమ వారం కలెక్టరేట్‌లో అదనపుకలెక్టర్లు డేవిడ్, యువ రాజ్ మర్మాట్‌లతో కలిసి అర్జీదారుల నుంచి దరఖా స్తులను స్వీకరించారు. లింగాపూర్ మండలం పిట్ట గూడ గ్రామానికి చెందిన ప్రజలు గ్రామంలో తాగు నీరు అందడంలేదని దరఖాస్తు చేశారు. పెంచికల్ పేట మండలకేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 108అంబులెన్సు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అర్జీ సమర్పించారు. కెరమెరి మండలం సాంగ్వి గ్రామానికి చెందిన రమేష్ సీసీరోడ్డు పను లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల బకాయిలు చెల్లించాలని వినతి సమర్పించారు. రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పుల్లుబాయి తమ మూడెకరాల భూమిలో ఫారెస్టు అధికారులు మొక్కలు పెడతామని బెదిరిస్తున్నారని జాయింట్ సర్వే చేపట్టి కొత్త పట్టా ఇప్పించాలని వినతిపత్రం సమర్పించారు. సిర్పూర్(యూ)మండలం మహ గాం గ్రామానికి చెందిన రాము తనకు రైతుభరోసా నిధులు జమచేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఆసిఫాబాద్ మండలం దానాపూర్ గ్రామంలో నిర్మించిన బీటీరోడ్డు పనుల్లో నాణ్యత లోపించి గుంతలమయంగా మారిందని గ్రామస్తులు నాందేవ్, మెంగాజీ, స్వప్నవినతిపత్రం సమర్పించారు. ఎన్‌హెచ్‌ఎం స్కీంకింద పనిచేస్తున్న మల్టీలెవల్ హెల్త్‌ప్రొవైడర్‌ల పెండింగ్‌వేతనాలను వెంటనే చెల్లిం చాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి బోగే ఉపేందర్ ఎంఎల్‌హెచ్‌పీలు అనూష, స్నేహ, రవీణ, ప్రత్యుష దరఖాస్తు సమర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చినదరఖాస్తు లను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయలన్నా రు. కార్యక్రమంలో డీఆర్వో వేణు పాల్గొన్నారు.