Share News

Kumram Bheem Asifabad: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ABN , Publish Date - Jul 28 , 2026 | 12:07 AM

ఆసిఫాబాద్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖా స్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకొవాలని

 Kumram Bheem Asifabad:   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ఆసిఫాబాద్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖా స్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకొవాలని అదనపు కలెక్టర్‌ ఎం డేవిడ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో డీఆర్వో వేణుతోకలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తు లను స్వీకరించారు. పెంచికల్‌పేట మండ లం ఎల్లూరు గ్రామానికి చెందిన నిర్మల తన కూతురుకు భూదానం కింద ఇచ్చిన భూమిని పట్టాచేసి పాస్‌పుస్తకం జారీ చేయాలని కోరుతూ దరఖాస్తు అందజే శారు. జైనూరు మండల కేంద్రానికి చెందిన శివాజి మీసేవా కేంద్రం మంజూరు చేయా లని, కాగజ్‌నగర్‌ మండలం దుర్గనగర్‌కు చెందిన సచిన్‌ మీస్త్రీ తాను సాగుచేస్తున్న ప్రభుత్వం భూమిని పట్టాచేసి పాస్‌పుస్తకం జారీచేయాలని, కౌటాల మండలం గురుడు పేట గ్రామానికి చెందిన లక్ష్మయ్య తన పట్టాభూమిని ఇతర వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని తనకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. రెబ్బెనమండలం నారాయణ పూర్‌ గ్రామానికి చెందిన కొండయ్య వార సత్వ ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ దర ఖాస్తు చేశారు. సిర్పూర్‌(టి) మండలం అచ్చెల్లి గ్రామానికి చెందిన చిరంజీవి తన వ్యవసాయభూమికి సంబంధించిన నక్ష జారీ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా అదనపుకలెక్టర్‌ మాట్లా డుతూ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Updated Date - Jul 28 , 2026 | 12:12 AM