Share News

Kumram Bheem Asifabad: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

ABN , Publish Date - Aug 31 , 2026 | 11:33 PM

ఆసిఫాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై వచ్చే అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరి ష్కరించే విధంగా చర్యలు తీసుకొవాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు.

Kumram Bheem Asifabad: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

ఆసిఫాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై వచ్చే అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరి ష్కరించే విధంగా చర్యలు తీసుకొవాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు యువరాజ్‌మర్మాట్‌, డేవిడ్‌, డీఆర్వో వేణు తోకలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరిం చారు. కాగజ్‌నగర్‌ పట్టణం ఎల్లాగౌడ్‌తోటకు చెందిన పరమేశ్వర్‌రావు తనపేరిట బొరిగాం గ్రామశివారులోగల పట్టాభూమిని నిషేదిత జాబితానుంచి తొలగించాలని దరఖాస్తు అందజేశా రు. కౌటాల మండలం మొగడ్‌దగడ్‌ గ్రామానికి చెందిన షాలుతామి పాటేదార్‌ తనకు 80శాతం దివ్యాంగత్వం ఉందని పెన్షన్‌ ఇప్పించాలని అర్జీ సమర్పించారు. లింగాపూర్‌ మండలం పిట్లతాండ గ్రామానికి చెందిన బాబురావు తమ గ్రామంలో డీఎంఎఫ్‌టీ నిధులతో పనిచేసిన వాటిబిల్లులు మంజూరు చేయా లని అర్జీ సమర్పించారు.

కెరమెరి మండలం పరందోళి గ్రామానికి చెందిన రాథోడ్‌ పుష్పలత ఘాట్‌సెక్షన్‌లో గ్రావెల్‌ పనిచేసిన వాటికి బిల్లులు మంజూ రు చేయాలని అర్జీ సమర్పించారు. తెలంగాణ వీరభద్రీయ కులసంఘం ప్రతినిధులు జిల్లాలోని సంచారజాతి వారికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌ లేకుండా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటా మన్నారు.

Updated Date - Aug 31 , 2026 | 11:33 PM