Share News

Kumram Bheem Asifabad: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ABN , Publish Date - Aug 17 , 2026 | 11:33 PM

ఆసిఫాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్ర మంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్క రించే విధంగా అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు.

Kumram Bheem Asifabad:   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ఆసిఫాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్ర మంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్క రించే విధంగా అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ ఎం డేవిడ్‌, జిల్లా రెవెన్యూఅధికారి దాసరి వేణుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీక రించారు. జిల్లా కేంద్రంలోని జనకాపూర్‌కు చెందిన సొన్నాయిల మానస తనకు దివ్యాం గుల పింఛను ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కాగజ్‌నగర్‌ మండలం అంకుషాపూర్‌కు చెందిన సోగాల కోమల్‌ తనకు జనకాపూర్‌ శివారులో గల పట్టా భూమిని కొలతలు నిర్వహించి హద్దులు నిర్ధా రించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఆసిఫాబాద్‌ మండలం పర్సానంబాల గ్రామా నికి చెందిన దుర్గం హనుమంతు తాను సాగుచేస్తున్న భూమికి పట్టాదారు పాసు పుస్తకం జారీచేయాలని కోరుతూ అర్జీ సమ ర్పించారు. కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన కాంపెల్లి రవీందర్‌ తన కుమారుడికి గురు కుల పాఠశాలలో సీటు ఇప్పిచాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఎస్‌ భాస్కర్‌రావు తనకు దహేగాం మండలం లగ్గాం గ్రామశివారులో గల భూములకు పట్టాపాస్‌ పుస్తకాలు జారీ చేయాలని కోరుతూ ఆర్జీ సమ ర్పించారు. ఆసిఫాబాద్‌ మండలం రహపల్లి గ్రామపంచాయతీ మాజీసర్పంచ్‌ పి శ్రీనివాస్‌ తాను సర్పంచ్‌ గా పనిచేసిన కాలం పెండింగ్‌ బిల్లులను ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజే శారు. కాగజ్‌నగర్‌ మండలం చింతగూడ కోయవాగు గ్రామానికిచెందిన సయ్యద్‌ జుబేర్‌ తనకు దివ్యాంగ పింఛ న్‌మంజూరుచేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించే విధంగా అధికారుల సమన్వ యంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులతో మాట్లాడుతూ ప్రతి మండల కేంద్రంలోని మండలపరిషత్‌ అభివృద్ధిఅధికారి కార్యాలయంలో మండల స్థాయి ప్రజా వాణి కార్యక్రమం నేటి నుంచి నిర్వహిస్తారని, అర్జీదారులు తమ సమస్య లపై మండలస్థాయిలో దరఖాస్తు చేసినట్ల యితే అక్కడే పరిష్కరిస్తారని తెలిపారు. అక్కడ పరిష్కారం కానట్లయితే జిల్లాకేంద్రం లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు సమర్పించవచ్చని తెలిపారు. మండలస్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2026 | 11:33 PM