Kumram Bheem Asifabad: ముసురు వాన.. మురిసిన రైతన్న
ABN , Publish Date - Jul 05 , 2026 | 11:39 PM
వాంకిడి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): వారం రోజుల నుంచి జిల్లాలో కురుస్తున్న ముసురు వర్షం రైతులకు ఊరట కలిగించింది.
- జీవం పోసుకున్న పంటలు
- కుదుటపడిన వ్యవసాయం
వాంకిడి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): వారం రోజుల నుంచి జిల్లాలో కురుస్తున్న ముసురు వర్షం రైతులకు ఊరట కలిగించింది. భూమికి పచ్చని రంగేసినట్లుగా పత్తిమొక్కలు మొలకెత్త డంతో ఈ ఏడాది సాగుపై ఆశలు చిగురిం చాయి. దీంతో రైతన్న మోముల్లో ఆనందం కనిపిస్తున్నది. నిన్నమొన్నటి వరకు మండే ఎండలతో పంటపొలాలు బీడుభూములుగా కనిపించాయి. పత్తిరైతులు ఎల్‌నినో హెచ్చరి కలు కూడా లెక్కచేయకుండా పత్తివిత్తనాలు వేశారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు ఆ విత్తనాలు మొలకొచ్చి పచ్చని చుక్కల్లా కనిపి స్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఆరురోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. జిల్లాలో 4.52 లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగుచేస్తుండగా 3.70,913ఎకరాలు పత్తిపంట, 47,228ఎకరాల్లో వరిపంట, 21,054ఎకరాల్లో పప్పుధాన్యాలు, 7,668 ఎకరాల్లో మొక్కజొన్న, 5,712ఎకరాల్లో ఇతర పంటలను పండిస్తున్నారు. రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. పత్తిపంటకు ఎరు వులు, కలుపుతీయడం వంటిపనుల్లో బీజీఅయ్యా రు. వానాకాలం ప్రారంభంలో వర్షాలు నిరాశపర్చి నా ప్రస్తుతం వర్షాలు అనుకూలంగా ఉండడంతో పంటల దిగుబడిపై రైతుల్లో ఆశలు నెలకొన్నాయి.
నిలిచిన వాన నీరు..
పెంచికల్‌పేట : రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతోమండలంలో బొంబాయిగూడ గ్రామంలో రహదారి పూర్తిగా వర్షం నీరుతో నిండిపోయింది. నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవటంతో ఈ మార్గంగుండా వెళ్లే విద్యార్థులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. అలాగే గుంట్లపేట గ్రామంలో రోడ్డు పూర్తిగా బురదమయంగా మారింది. నడిచేందుకు కూడా కష్టంగా మారింది. అధికారులు స్పందించి వర్షం నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.