Share News

Kumram Bheem Asifabad: నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలి

ABN , Publish Date - Aug 03 , 2026 | 11:56 PM

ఆసిఫాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు.

 Kumram Bheem Asifabad:  నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలి

ఆసిఫాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. చట్టం ప్రకారం త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని, సంబం ధిత పోలీసు అధికారులను ఫోన్లో ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిసోమవారం నిర్వ హించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాపోలీసుశాఖ ప్రజలకు చేరువగా ఉండి శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ప్రజలసమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.

Updated Date - Aug 03 , 2026 | 11:56 PM