Share News

Kumram Bheem Asifabad: నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలి

ABN , Publish Date - Jul 20 , 2026 | 11:45 PM

ఆసిఫాబాద్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా నిర్భ యంగా పోలీసుసేవలను వినియోగించుకోవా లని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు.

Kumram Bheem Asifabad:   నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలి

ఆసిఫాబాద్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా నిర్భ యంగా పోలీసుసేవలను వినియోగించుకోవా లని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఆమె ఫిర్యాదులను స్వీకరించారు. చట్టం ప్రకారం త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని, సంబంధిత పోలీసు అధికా రులను ఫోన్లో ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ ప్రతిసోమవారం నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకో వాలని కోరారు. జిల్లా పోలీసు శాఖ ప్రజలకు చేరువగాఉండి శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలసమస్యల పరిష్కారానికి కట్టు బడి పనిచేస్తోందని తెలిపారు.

Updated Date - Jul 20 , 2026 | 11:45 PM