Kumram Bheem Asifabad: నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలి
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:50 PM
ఆసిఫాబాద్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా నిర్భయంగా పోలీసు సేవ లను వినియోగించు కోవా లని జిల్లా ఎస్పీ నితికాపంత్ అన్నారు.
ఆసిఫాబాద్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా నిర్భయంగా పోలీసు సేవ లను వినియోగించు కోవా లని జిల్లా ఎస్పీ నితికాపంత్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి చట్టప్రకారం త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా పోలీసుశాఖ ప్రజలకు చేరువగా ఉండి శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.