Share News

Kumram Bheem Asifabad: బోనం సమర్పించి.. మొక్కులు చెల్లించి

ABN , Publish Date - Jul 05 , 2026 | 11:40 PM

బెజ్జూరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన్నసిద్దాపూర్‌ గ్రామంలో ఆదివారం గ్రామస్తులు గ్రామదేవత పోచమ్మకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Kumram Bheem Asifabad:  బోనం సమర్పించి.. మొక్కులు చెల్లించి

గ్రామాల్లో మొదలైన అకాడ పూజలు

బెజ్జూరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన్నసిద్దాపూర్‌ గ్రామంలో ఆదివారం గ్రామస్తులు గ్రామదేవత పోచమ్మకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలంతా ఉదయం గ్రామంలో తలపై బోనాలను ఎత్తుకొని ఊరేగిస్తూ పోచమ్మ ఆల యానికి వచ్చి ప్రత్యేకపూజలు నిర్వహించారు. నైవే ధ్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సకా లంలో వర్షాలు కురిసి పాడిపంటలు పండి చల్లగా చూడాలని కోరుతూ బోనమెత్తారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. బోనాల కార్యక్రమానికి చుట్టపక్క గ్రామాల ప్రజలు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్‌ సెండె పద్మ శంకర్‌ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రూ.5016 నగదును ఆల యానికి వితరణ చేశారు. నాగుల్వాయి గ్రామంలో పోచమ్మ ఆలయ వార్షికో త్సవం సందర్భంగా బోనాలు నిర్వహిం చారు. రెబ్బెన మం డలం ఇందిరానగర్‌ మహంకాళి ఆలయ అర్చకులు దేవర వినోద్‌ ఆధ్వర్యంలో మహాచండీ సహిత రుద్రహోమంతో బోనాల కార్యక్రమం నిర్వహించారు.

చింతలమానేపల్లి : మండలంలోని కర్జెల్లి, చింతలమానేపల్లి తదితర గ్రామాల్లో ఆదివారం అకాడ పండగ సందడి నెలకొంది. ఆయా గ్రామాల్లో గ్రామదేవత పోషమ్మ ఆలయం వద్ద భక్తులు, మహిళలు ప్రత్యేకమొక్కులు చెల్లించు కున్నారు. ఏటా ఆషాడమాసంలో గ్రామాన్ని చల్లగా చూడాలని,పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ గ్రామస్థులుమొక్కులు చెల్లించుకుంటా రు. పోశమ్మ అమ్మవారికి నైవేధ్యం సమర్పించారు.

సిర్పూరు(టి) : మండలంలో వివిధ గ్రామాల్లో ఉదయం అకాడ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోచమ్మ ఆలయం వద్ద పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మొదటి అకాడ కావటంతో రైతులు తమతమ చేనుల్లో చల్లిన విత్తనాలతో అధిక పంటలు పండాలని మొక్కులు తీర్చుకున్నారు.

Updated Date - Jul 05 , 2026 | 11:40 PM