Kumram Bheem Asifabad: అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:36 PM
ఆసిఫాబాద్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): మహిళా శిశుసంక్షేమ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
- జిల్లాలో 153అంగన్‌వాడీ టీచర్, 280ఆయా పోస్టులు
- ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం
- ఈనెల 23వరకు గడువు
ఆసిఫాబాద్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): మహిళా శిశుసంక్షేమ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలలో పనిచేసేందుకు టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీ ప్రక్రియకు జిల్లా మహిళా, శిశు సంక్షేమ దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమశాఖ తాజాగా నోటిఫికేషన్‌ను జారీచేసింది. జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 153అంగన్‌వాడీ టీచర్, 280ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన మహిళ అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను శుక్రవారం నుంచిఈనెల 23 వరకు స్వీకరించనున్నారు.
ఖాళీలు, అర్హతకు సంబంధించిన పూర్తి వివరాలను జ్ట్టి..//ఠీఛీఛిఠీ.్టజ.ుఽజీఛి.జీుఽ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
ప్రాజెక్టుల వారీగా టీచర్, ఆయా పోస్టుల ఖాళీలు..
ఆసిఫాబాద్ జిల్లాలోని 15మండలాల్లో మొత్తం ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో సిర్పూర్(టి) ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి, పెంచికల్‌పేట, సిర్పూర్(టి)మండలాల్లో 9అంగన్‌వాడీ టీచర్, 19అయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగజ్‌నగర్ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే దహెగాం, కాగజ్‌నగర్ మండలాల్లో 4అంగన్‌వాడీ టీచర్, 7అయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసిఫాబాద్ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే రెబ్బెన, ఆసిఫాబాద్, తిర్యాణి మండలాల్లో 49 అంగన్‌వాడీ టీచర్, 75ఆయాపోస్టులు ఖాళీగా ఉన్నాయి. జైనూరు ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే సిర్పూర్(యూ), లింగాపూర్, జైనూరు మండలాల్లో 39అంగన్‌వాడీ టీచర్లు, 124 అయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాంకిడి ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే కెరమెరి, వాంకిడి మండలాల్లో 52అంగన్‌వాడీ టీచర్, 55ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా 153 అంగన్‌వాడీ టీచర్, 280ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు ఇవి..
అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణత తప్పనిసరి. ఆయా పోస్టులకు ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేనిపక్షంలో పదవతరగతి ఉత్తీర్ణులను పరిగణలోకి తీసుకుంటారు. అభ్యర్థుల వయస్సు 01.07.2026 నాటికి 18నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థి సంబంధిత అంగన్‌వాడీ కేంద్ర పరిధిలోని స్థానికమహిళ అయిఉండాలి. పట్టణ ప్రాంతాల్లో సంబంధిత వార్డు గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత గ్రామపంచాయతీకి చెందిన వారై ఉండాలి. ఎస్టీ సబ్‌ప్లాన్ పోస్టులకు అదేగ్రామం లేదా ఆవాసానికి చెందిన ఎస్టీ అభ్యర్థులు ఎస్సీ సబ్‌ప్లాన్ పోస్టులకు అదే గ్రామం లేదా ఆవాసానికి చెందిన ఎస్సీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఇంటర్ మీడియట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపికలో 70మార్కులు వితంతువులకు 5, అనాథలకు 10, దివ్యాంగులకు 5 మార్కులు కేటాయిస్తారు. జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూకు 10 మార్కులు ఉంటాయి.