Kumram Bheem Asifabad: పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి
ABN , Publish Date - Aug 17 , 2026 | 11:35 PM
కెరమెరి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రానున్న స్థానికసంస్థల ఎన్నికల్లో పార్టీఅభ్యర్థుల విజయానికి కృషి చేయాలని జిల్లాఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
- జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు
కెరమెరి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రానున్న స్థానికసంస్థల ఎన్నికల్లో పార్టీఅభ్యర్థుల విజయానికి కృషి చేయాలని జిల్లాఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం రాత్రి ఆయన మండల కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యక ర్తలతో మాట్లాడారు. పార్టీలో గ్రూపులను పక్కనపెట్టాల న్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను తప్ప కుండా గెల్పించాలన్నారు. కాంగ్రెస్‌ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమపథకాలను ఇంటింటా వివరించా ల్సిన బాధ్యత ప్రతికార్యకర్తపై ఉందన్నారు. ఈ సందర్భంగా అనార్‌పల్లి వాగుపై వంతెన నిర్మించాలని కార్యకర్తలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీరశ్యాం నాయక్, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు సుజాయిత్ ఖాన్, నాయకులు రాథోడ్ శంకర్, మోహర్లె బాపురావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.