Share News

Kumram Bheem Asifabad: ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ

ABN , Publish Date - Aug 26 , 2026 | 11:46 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను ముస్లింలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు.

 Kumram Bheem Asifabad:  ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను ముస్లింలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జామ మసీద్‌ నుంచి వివేకానందచౌక్‌, అంబేద్కర్‌చౌక్‌, గాంధీచౌక్‌ల మీదుగా ర్యాలీ కొనసాగింది. మహమ్మద్‌ ప్రవక్తను స్మరిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. ప్రధాన వీధులగుండా ర్యాలీ కొనసాగడంతో పట్టణంలో సంద డి నెలకొంది. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు మాట్లాడుతూ మహ్మద్‌ప్రవక్త చెప్పిన శాంతిమార్గంలో నడవాలని ఆయన చూపిన బాటలో నడుస్తూ సేవా తత్వాన్ని అలవరుచుకోవాలని పిలుపునిచ్చారు. మహ్మ ద్‌ ప్రవక్త లోకానికి శాంతి సందేశం ఇచ్చారని ప్రతి ఒక్కరిని సోదరసమానులుగా భావించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌వైస్‌చైర్మన్‌ అహ్మద్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మ ద్‌, కాంగ్రెస్‌ జిల్లా ఉపాఽఽధ్యక్షుడు తారీఖ్‌, నాయకులు బాసీత్‌, సాంషాద్‌ హుస్సేన్‌, సాజీద్‌, అబ్దుల్‌రహమాన్‌,నిసార్‌, పెంటు, ఇమ్రాన్‌, అబ్దుల్లా, తాజ్‌, ఖలీల్‌, అమర్‌, జాఫర్‌లుపాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐలు నీలం రవి, సంజయ్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిం చారు.

కాగజ్‌నగర్‌ : కాగజ్‌నగర్‌ పట్ట ణంలో బుధవారం మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పలు వీధుల గుండా సాగి రాజీవ్‌గాంధీ చౌరస్తా వరకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయాపార్టీల నాయకులు మిఠాయిలను పంపిణీచేశారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు, మతపెద్దలు, ఆయాపార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకో కుండా డీఎస్పీ వహిదోద్దీన్‌ గట్టి బందోబస్తు నిర్వహించారు.

సిర్పూరు(టి): మండలకేంద్రంలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్‌పార్టీ జాతీయకార్యదర్శి ఆదిత ముస్లింలకు మిఠాయిలను పంపిణీ చేశారు.

కెరమెరి: మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా సుల్తాన్‌ గూడ నుంచి కెరమెరి వరకు ముస్లింలు ర్యాలీ నిర్వహించారు.

Updated Date - Aug 26 , 2026 | 11:46 PM