Kumram Bheem Asifabad: భూ సంబంధిత దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:11 AM
ఆసిఫాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): భూ భారతి రెవెన్యూ సదస్సులు సాదాబైనామాల భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కె హరిత అన్నారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): భూ భారతి రెవెన్యూ సదస్సులు సాదాబైనామాల భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో రెవె న్యూసదస్సులో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం, భూభా రతి, సాదాబైనామాలు రీసర్వే ఆంశాలపై తహసీల్ధార్లు, మండల సర్వేయర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతసంవత్సరం నిర్వహిం చిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులలో పెండిం గ్‌లో ఉన్న వాటిని భూభారతి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాల న్నారు. సాదాబైనామా కింద భూముల క్రమబద్దీకరణకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారించి నిబంధ నల ప్రకారం త్వరగా పరిష్క రించాలన్నారు. పెండిం గ్‌లో ఉన్న దరఖాస్తులకు గల కారణలను తహసీ ల్దార్లను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి గ్రామాల సరిహద్దులను గుర్తించి ఎంజాయ్ మెంట్ సర్వే నిర్వహించాలని తెలిపారు. రీసర్వేలో తీసుకోవా ల్సిన జాగ్రత్తలపై పవర్‌పా యింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. సమావేశంలో అదనపుకలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీవో లోకేశ్వర్ రావు, డిప్యూటీకలెక్టర్ జోసెఫ్ జోయల్, ఏడీ వినయ్, తహసీల్ధార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.
చాకలి ఐలమ్మ పోరాటం ఆదర్శనీయం..
తెలంగాణ వీరనారీ చాకలి ఐలమ్మ నేటి సమాజానికి ఆదర్శ నీయమని కలెక్టర్ కె హరిత అన్నా రు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ జయంతి వేడుక లకు హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూస్వాము లు, రజాకార్లపై చాకలిఐలమ్మ వీరోచిత పోరాటం చేసిందన్నారు. ఐలమ్మ స్ఫూర్తితో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం సమష్టిగా కృషి చేద్దామని తెలిపారు. జిల్లా కేంద్రంలో కమ్యూనిటీహాల్, చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకోసం ప్రభుత్వానికి నివేదికలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపుకలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, డీఆర్వో వేణు, మార్కెట్‌కమిటీ చైర్మన్ మంగ, బీసీ సంక్షేమాధికారి నదీం, రజక సంఘం నాయకుల కడతల మల్లయ్య, రాజేందరర్, చంద్రగిరి, విలాస్, కడతల సాయి, బీసీ సంఘం నాయకులు రూప్‌నార్ రమేష్, మారుతి, శంకర్ పాల్గొన్నారు.