Kumram Bheem Asifabad: విద్యార్థులను ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే
ABN , Publish Date - Sep 05 , 2026 | 11:57 PM
ఆసిఫాబాద్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): సమాజంలో విద్యార్థులను ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దే శక్తి కేవలం ఉపాధ్యాయులకు మాత్ర మే ఉందని కలెక్టర్ కె.హరిత అన్నారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): సమాజంలో విద్యార్థులను ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దే శక్తి కేవలం ఉపాధ్యాయులకు మాత్ర మే ఉందని కలెక్టర్ కె.హరిత అన్నారు. శని వారం కలెక్టరేట్‌లో పాఠశాల విద్యాశాఖ ఆధ్వ ర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరిం చుకుని జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేసే కార్యక్రమానికి అద నపుకలెక్టర్ యువరాజ్‌మర్మాట్, జిల్లా విద్యాశాఖ అధికారి సచ్చిదానందచారితోకలిసి ఆమె హాజరయ్యారు. ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేసి శాలువా లతో సన్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడం కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే సాధ్యమని అన్నారు. తన శిష్యుల ఎదుగుదలనే గురుదక్షిణగా భావించే ఒకే ఒక వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే అని అన్నారు. గురువు దైవంతో సమానమని, విద్యార్థులు 100శాతం బడికి వచ్చే విధంగా ఉపాధ్యాయుల కృషిచేయాలని, వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలని తెలిపారు. జిల్లాలో విద్యారంగం బలోపేతం దిశగా అన్నిచర్యలు తీసుకుం టున్నామని, ప్రభుత్వం అనేక మౌలికవసతులు కల్పి స్తుందని తెలిపారు. ఈ సందర్భంగా 38మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ తరఫున కలెక్టర్, అదనపుకలెక్టర్‌లను శాలు వాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఉత్తమఉపాధ్యా యులు, ఉపాధ్యాయసంఘాల ప్రతినిధులు, జిల్లా విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా హియరింగ్ ప్రక్రి యను వేగవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. శని వారం కలెక్టరేట్‌లో కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్‌రావుతోకలిసి జూం మీటింగ్‌ద్వారా జిల్లాలోని తహసీల్దార్‌లతో సమీక్షిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మ్యాపిం గ్ కాని, అనామలిస్ జాబితాలో పేరు ఉన్న ఓట ర్లకు హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేసి అవసరమైన ధ్రువపత్రాలను స్వీకరించాలని తెలి పారు. సహాయఎన్నికల అధికారుల లాగిన్‌లోని వివరాలను త్వరగా పరిష్కరించాలన్నారు. ఈ నెల 6, 12, 13 తేదిల్లో ప్రతిపోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేకప్రచార దినోత్సవాలను నిర్వహించి 6, 7, 8ఫారాలు స్వీకరించాలన్నారు. నిర్ణీత గడువులోగా హియరింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు.
దివ్యాంగులకు అసౌకర్యం కలుగకుండా వసతులు కల్పించాలి
ఆసిఫాబాద్ రూరల్ : సదరం శిబిరానికి హాజరయ్యే దివ్యాంగులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగ కుండా మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న సదరం శిబిరాన్ని సంద ర్శించి దివ్యాంగులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలిం చారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 8వరకు జరుగ నున్న శిబిరాలకు హాజరయ్యే దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు.