Kumram Bheem Asifabad: గీత కార్మికులకు గుర్తింపు కార్డు తప్పనిసరి
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:06 AM
వాంకిడి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): గీత కార్మికులు సంక్షేమ, ప్రభుత్వ పథకాలు, వివిధ ప్రయోజనాలు పొందడానికి ఎక్సైజ్ లైసెన్స్ లేదా ఐడెంటీ కార్డు కలిగి ఉండటం తప్పనిసరి.
వాంకిడి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): గీత కార్మికులు సంక్షేమ, ప్రభుత్వ పథకాలు, వివిధ ప్రయోజనాలు పొందడానికి ఎక్సైజ్ లైసెన్స్ లేదా ఐడెంటీ కార్డు కలిగి ఉండటం తప్పనిసరి. కార్మికులందరూ ఈ కార్డును కచ్చితంగా తీసుకోవాలని అధికారులు గీత కార్మికసంఘం నాయకులు ఈ సందర్భంగా సూచిస్తున్నారు.
- ప్రయోజనాలు..
తాటి, ఈత చెట్టు ఎక్కే సమయంలో ప్రమాదవశాత్తు జారిపడి మరణించినా.. శాశ్వత దివ్యాంగులైనా బాధిత కార్మిక కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.5లక్షల బీమా పరిహారం అందుతుంది. దీనికి గుర్తిం పుకార్డు తప్పనిసరి. చెట్లు ఎక్కేటప్పుడు రక్షణకోసం సర్కార్ సందించే ఆధునిక రక్షణ సరికరాల కిట్టు(కాటయ్య కిట్లు) పొందడా నికి, ప్రత్యేక పింఛన్ అందుకోవడానికి, గీత కార్మికుల కార్పొరేషన్ లేదా వెనుకబడిన తరగతుల సమక్షేమశాఖ ద్వారా లభించే రుణాలు, ఇతర ఉపాధిపథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఇది అవసరం. వృత్తి లైసెన్స్ పొందడానికి ఉపయోగపడుతుంది. గీత కార్మికులు ఈ కార్డులను పొందడానికి గీతకార్మిక సొసైటీల ద్వారా ఎక్సైజ్ అధి కారులు నిర్వహించే ట్యాడీటాపింగ్ టెస్టింగ్ (చెట్టు ఎక్కేపరీక్ష) పాస్ అవ్వాల్సి ఉంటుంది.
ఫ కావాల్సిన పత్రాలు..
- ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, (తెల్ల రేషన్ కార్డు ఉంటే ప్రాధాన్యం ఇస్తారు)
- బ్యాంకుపాసుపుస్తకం జిరాక్స్, పాస్‌పోర్ట్ ఫొటోలు
- వృత్తి ధ్రువీకరణపత్రం, సంఘం సర్టిఫి కేట్, గీతకార్మికవృత్తిలో ఉన్నట్లు స్థానిక గీత కార్మికసంఘం లేదా సొసైటీప్రెసిడెంట్ సంత కం చేసిన లేఖ లేదా ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. సెల్‌ఫోన్ నంబరు ఆధార్‌కార్డుకు లింక్ అయి ఉండాలి.
- పైన పేర్కొన్న అన్నిపత్రాలను తీసుకుని మీ సేవా కేంద్రంలో అప్టై చేసుకోవాలి.