Kumram Bheem Asifabad: రూ.50లక్షల విలువైన గంజాయి మొక్కలు స్వాధీనం
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:11 PM
ఆసిఫాబాద్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): గంజా యి సాగుదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపు తున్నారు. మూడురోజులుగా చేపట్టిన పోలీసుల ప్రత్యేక తనిఖీల్లో మూడు పోలీసుస్టేషన్‌ల పరిధిలో 6కేసులు నమోదుచేసి రూ.50లక్షల విలువైన 500 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): గంజా యి సాగుదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపు తున్నారు. మూడురోజులుగా చేపట్టిన పోలీసుల ప్రత్యేక తనిఖీల్లో మూడు పోలీసుస్టేషన్‌ల పరిధిలో 6కేసులు నమోదుచేసి రూ.50లక్షల విలువైన 500 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జిల్లాపోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నితికా పంత్ వివరాలను వెల్లడించారు. జిల్లాను గంజాయిరహితం గా మార్చడమే లక్ష్యంగా గంజాయి సాగు, రవాణా విక్రయాలపై ప్రత్యేకతనిఖీలు నిర్వహిస్తున్నామన్నా రు. ఇందులో భాగంగా లింగాపూర్, సిర్పూర్(యూ), కెరమెరి పోలీసు స్టేషన్‌ల పరిధిలో డీఎస్పీఅశోక్ ఆధ్వర్యంలో ప్రత్యేకతనిఖీలు నిర్వహించామన్నారు. ఈ తనిఖీల్లో 500గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించచామన్నారు. స్వాధీనం చేసు కున్న గంజాయి మొక్కల విలువ రూ.50లక్షలు ఉంటుందన్నారు. జిల్లాలో 2025లో గంజాయి సాగుకు సంబంధించి 39 కేసులు నమోదుచేసి 35మంది నిందితులను అరెస్టు చేశామ న్నారు. వారినుంచి రూ.1.13 కోట్ల విలువైన 1134గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకు న్నామన్నారు. ఈ సంవత్సరం లో ఇప్పటివరకు 23కేసులు నమోదు చేసి 27మంది నింది తులను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.2.36కోట్ల విలువైన 2366గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకు న్నామన్నారు. 2026లో ఇప్పటివరకు డ్రై గంజాయి అక్రమరవాణా విక్రయాలకు సంబంధించి 32కేసులు నమోదుచేసి వారి నుంచి రూ.3లక్షల విలువైన 10 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకొని 68మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. జిల్లాలో ఎక్క డైనా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. ఈ తనిఖీలలో పాల్గొన్న పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినం దించారు. సమావేశంలో డీఎస్పీ అశోక్, వాంకిడి సీఐ వేణుగోపాల్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.