Kumram Bheem Asifabad: ఎన్యూమరేషన్ ఫారాలు త్వరగా పంపిణీ చేయాలి
ABN , Publish Date - Jun 29 , 2026 | 11:29 PM
ఆసిఫాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలను త్వరగా ఓటర్లకు పంపిణీ చేయాలని కలె క్టర్ కె హరిత అన్నారు.
- కలెక్టర్ కె హరిత
ఆసిఫాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలను త్వరగా ఓటర్లకు పంపిణీ చేయాలని కలె క్టర్ కె హరిత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్ నుంచి ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అన్ని మండలాల తహసీల్దార్‌లు, బీఎల్‌వోలతో సర్‌పై జూమ్‌మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మ్యాపింగ్ అయిన ఓటర్లకు ఎన్యుమ రేషన్ ఫారాల పంపిణీ 90శాతం పూర్తయిందని మిగితా మొత్తాన్ని కూడా సాధ్యమైంత త్వరగా పూర్తి చేయాలన్నారు. పంపిణీ చేసిన ఫారాలను ఇంటింటికి తిరిగి వెళ్లి తీసుకోవాలన్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించి సరైన వివరాలు లేకుంటే బీఎల్‌వో అప్లికేషన్‌లో సరిచేయా లన్నారు. పోలింగ్‌బూత్‌లో 1200కంటే ఎక్కువ ఓటరు ఉంటే అక్కడ రేషనైజేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. తప్పులు లేకుండా ఓటరు జాబితా తయారు చేసేలా క్షేత్రస్థాయిలో సిబ్బందిచూసి చేయాలన్నారు. ఇదే సం దర్భంగా వీఐపీఓటర్లు తప్పిపోకుండా చూడాలన్నారు.
ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో
మహిళలు భాగస్వాములు కావాలి..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో మహిళా సంఘాల సభ్యులు భాగస్వాములు కావాలని కలెక్టర్ కె.హరిత పిలుపుని చ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణాభి వృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా మహిళా సమాఖ్యప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వపథకాలపై ప్రజలకు పూర్తి అవ గాహన కల్పించడంలో మహిళాసంఘాలు కీలకపాత్ర పోషించాలన్నారు. పాఠశాలవిద్యార్థుల యూనిఫాంలు కుట్టుడు పనులు మహిళాసంఘాలు నిర్ణీత గడువు లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. రానున్న 10 రోజుల్లో ఈ ప్రక్రియను ఒకమిషన్‌మోడ్‌లో పూర్తిచేసి విద్యార్థులకు అందించాలన్నారు. గ్రామాల్లోని మహిళ లకు ఉపాధి కల్పించేలా చర్యలు ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సమాఖ్యఅధ్యక్షురాలు, ప్రతినిధులు, డీపీఎంలు, డీఆర్‌డీఏలు పాల్గొన్నారు.
నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగ అవకాశాలు..
నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరు గుతాయని కలెక్టర్ కె హరిత అన్నారు. హైదరాబాద్ జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు నెలల పాటు అందిస్తున్న ఉచితశిక్షణకు ఎంపికైన అభ్యర్థులు బయలుదేరుతున్న బస్సుకు జిల్లాకేంద్రం లోని సమీకృత భవన కార్యాలయ ఆవరణలో జెండా ఊపి ప్రాంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా అంది స్తున్న శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆదివాసీ మండ లాలైన జైనూరు, సిర్పూర్(యూ), లింగాపూర్, తిర్యా ణి, కెరమెరి మండలాలకు చెందిన 45మంది ఎంపికయ్యారని వీరంతా శిక్షణ సద్వినియోగం చేసుకుని ఉన్నతశిఖరాలు అధిరో హించాల న్నారు. కార్యక్రమంలో ఉపాధికల్పన అధికారి కిరణ్, సింగరేణి డీజీఎం కిరణ్‌బాయి, జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ప్రతినిధి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల
నివారణకు చర్యలు చేపట్టాలి..
జిల్లాలో రహదారి ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె హరిత అన్నారు. సోమ వారం కలెక్టరేట్‌లో ఎస్పీ నితికా పంత్, అదనపు కలె క్టర్ యువరాజ్ మర్మాట్, సబ్‌కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి రహదారి భద్రత కమిటీ సమా వేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రహదారి ప్రమాదాలు జరగ కుండా నివారించేందుకు రక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. జాతీయ రహదారి సంస్థ అధికారులు సర్వీస్ రహదారులపై స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేయా లని, రాంగ్‌రూరట్, యూటర్న్‌ల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో10చోట్ల ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో రహదారిపై గుం తలు మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. రావాణా శాఖ అధికారులు, పాఠశాలల బస్సులను నిరంత రంగా తనిఖీ చేపట్టాలని, ప్రమాదాలు జరిగితే వెం టనే తరలించే విధంగా అంబులెన్స్ సేవలు అందుబా టులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీలు వహిదుద్దీన్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.