Kumram Bheem Asifabad: కోలాం గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:16 PM
వాంకిడి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): కోలాం గిరిజనుల సమస్యల పరిష్కారా నికి ప్రభుత్వం కృషిచేయాలని ఆదిమ గిరిజన కోలాం సేవాసంఘం జిల్లా అధ్య క్షుడు ఆత్రం తిరుపతి, జిల్లా కార్య నిర్వాహక అధ్యక్షుడు సీడాం అన్నిగా డిమాండ్ చేశారు.
వాంకిడి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): కోలాం గిరిజనుల సమస్యల పరిష్కారా నికి ప్రభుత్వం కృషిచేయాలని ఆదిమ గిరిజన కోలాం సేవాసంఘం జిల్లా అధ్య క్షుడు ఆత్రం తిరుపతి, జిల్లా కార్య నిర్వాహక అధ్యక్షుడు సీడాం అన్నిగా డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని కోలాం సంక్షేమసంఘం కార్యాలయంలో సోమవారం జిల్లాకార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని కోలాంగిరిజన మారుమూల గ్రామాలకు ప్రభుత్వం మౌళిక సదుపాయాలు కల్పించి పీఎంజన్‌మన్ పథకంలో భాగంగా ఇళ్లు మంజూరు చేయాలన్నారు. వ్యవసాయ భూములకు సంబంధించి పాత పట్టా లు కలిగిన రైతులకు కొంతమందికి మాత్రమే కొత్తవి ఇచ్చారని అన్నారు. పట్టాలురాని రైతులు రైతుబంధు, లాంటి పథకాలకు దూరమవుతున్నా రని ప్రతిఒక్కరికి పట్టాలు అందించాలని డిమాండ్ చేశారు. చదువుకున్న కోలాంఆదిమగిరిజన యువతి, యువలకు ఉపాధి కల్పించాలన్నారు. కుమరం సూరు వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వ హించాలని డిమాండ్ చేశారు. ఆదిమకోలాం గిరి జనుల సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజు ల్లో పోరాటాలు చేయడానికి కార్యచరణ చేపట్టను న్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పీవీటీజీ సంఘం జిల్లా అధ్యక్షుడు మడావి మాన్కు, జిల్లా నాయకులు సీడాం నాగోరావ్, ఆత్రం జల్పత్‌రావ్, కుమరంలింగు,ఆత్రం గంగారాం, మండలంలోని కోలాం గిరిజనులు పాల్గొన్నారు.
ఫ ఆదిమ గిరిజన కోలాం
సేవా సంఘం నూతన కార్యవర్గం
మండల ఆదిమ గిరిజన కోలాం సేవాసంఘం నూతన కార్యవర్గంను సోమవారం ఏర్పాటు చేసి నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు ఆత్రం తిరుపతి తెలిపారు. అధ్యక్షుడిగా సీడాం పగ్గు, గౌరవ అధ్యక్షు డిగా కుమరం పగ్గు, ఉపాధ్యక్షులుగా కుమరం చిన్ను, ఆత్రం రాము, ప్రధానకార్యదర్శిగా ఆత్రం మాధవరావ్, కార్యదర్శిగా మడావిజైరాం, సంయుక్త కార్యదర్శిగా ఆత్రంఆనంద్‌రావు, కోశాధికారిగా కుమ రం భీంరావు, ప్రచారకార్యదర్శిగా సీడాం భీంరావు, సలహాదారులుగా ఆత్రం మెంగోరావు,ఆత్రం మారు తిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.