Kumram Bheem Asifabad: కలెక్టరేట్ ఎదుట భవన నిర్మాణ కార్మికుల ధర్నా
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:44 PM
ఆసిఫాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
ఆసిఫాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లాకార్యదర్శి రాజేందర్ తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమబోర్డు అమలు చేస్తున్న సంక్షేమపథకాలను ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించకూడదని జీవో12ను వెంటనే రద్దు చేసి వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండు చేశారు. ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసేందుకు జీవో12ను తీసుకొ చ్చినట్టు చెప్పారు. కార్యక్రమంలో భవననిర్మాణ కార్మికసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలకిషన్, గౌస్‌బాబా, నాయకులు కమలాకర్, అశోక్, రవి, రాంచందర్, తదితరులు పాల్గొన్నారు.