Kumram Bheem Asifabad: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
ABN , Publish Date - Aug 17 , 2026 | 11:36 PM
ఆసిఫాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గోడం నగేష్ తెలిపారు.
-ఎంపీ గోడం నగేష్
ఆసిఫాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గోడం నగేష్ తెలిపారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం కలెక్టర్ కె హరిత, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులపట్ల మర్యాదగా మాట్లాడాలన్నారు. ప్రభుత్వం వైద్యంపై ప్రజల్లో నమ్మకం కలిగించేలా చూడాలన్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిల్లోకి వచ్చేరోగులకు మెరుగైన వైద్యసేవ లను అందించాలని సూచించారు. కలెక్టర్ కె హరిత ఆసుపత్రి ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన పరికరాలు, సదుపాయాలు, సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకాష్, జిల్లావైద్యఆరోగ్యశాఖ అధికారి నాగేంద్ర, కళాశాల ప్రిన్సిపాల్ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.