Share News

Kumram Bheem Asifabad: బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో..

ABN , Publish Date - Oct 10 , 2026 | 11:34 PM

ఆసిఫాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): తెలం గాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి.

Kumram Bheem Asifabad:  బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో..

- ప్రారంభమైన ఎంగిలిపూల బతుకమ్మ

ఆసిఫాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): తెలం గాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. శనివారం ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలను జిల్లావ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు నిర్వహిం చే బతుకమ్మవేడుకల్లో తీరొక్క పూలతో బతుకమ్మ లను పేర్చి భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పాటలతో వేడు కలు నిర్వహిస్తారు. దీంతో జిల్లాకేంద్రంలో బతుక మ్మను పేర్చేందుకు పూలను కొనేందుకు ప్రజలు పెద్ద ఎత్తునరావడంతో మార్కెట్‌సందడిగా మారింది. సాయంత్రం తీరొక్కపూలతో పేర్చిన బతుకమ్మలతో పట్టణంలోని బజార్‌వాడీ, పైకాజీనగర్‌, బ్రాహ్మణవాడ, రావులవాడ, రాజంపేట, వాసవీనగర్‌, హడ్కోకాలనీ, సందీప్‌నగర్‌, జన్కాపూర్‌,కంచుకోట, కసాబ్‌వాడీ, టీఆర్‌నగర్‌ కాలనీలలోని ఆలయాలు, ప్రధానకూడళ్ల వద్ద మహిళలు బతుకమ్మ అడారు.

కాగజ్‌నగర్‌/దహెగాం/సిర్పూరు/కెరమెరి/ చింతలమానేపల్లి/పెంచికల్‌పేట/రెబ్బెన /కౌటాల/తిర్యాణి: తెలంగాణ సంస్కృతీ, సంప్రదా యాలకు ప్రతీకగా నిలిచేబతుకమ్మ వేడుకలను కాగజ్‌నగర్‌లోని వివిధవార్డుల్లో, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో మహిళలు ఘనంగా నిర్వహించారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి సంప్రదాయ దుస్తులు ధరించి మహిళలు ఉత్సా హంగా వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ సందడిచేశారు. ఉత్సాహభరిత వాతావరణంలో బతుకమ్మ వేడుకలు కొనసాగాయి. ఈ వేడుకలతో పట్టణంలో పండుగ శోభ నెలకొంది. ఆయా కూడళ్లలో బతుకమ్మలతో మహిళలు ఆటలు ఆడుతూ పాటలుపాడారు. అనంతరం స్థానిక వాగులో నిమజ్జనం చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. సిర్పూరు(టి)లో పేట్‌ మహిళ, డౌన్‌ ఏరియా, బ్రాహ్మణవాడతో పాటు తదితర కాలనీల్లో బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటాయి.

Updated Date - Oct 10 , 2026 | 11:34 PM