Kumram Bheem Asifabad: పైరవీలు లేకుండా పోలీసు సేవలను వినియోగించుకోవాలి
ABN , Publish Date - Jul 28 , 2026 | 12:06 AM
ఆసిఫాబాద్, జూలై 27 (ఆంధ్ర జ్యోతి): ప్రజలు ఎలాంటి పైర వీలు లేకుండా నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించు కోవాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ అన్నారు.
ఆసిఫాబాద్, జూలై 27 (ఆంధ్ర జ్యోతి): ప్రజలు ఎలాంటి పైర వీలు లేకుండా నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించు కోవాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిం చిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యా దులను స్వీకరించారు. చట్టం ప్రకారం త్వరితగతిన సమస్యలను పరిష్కరిం చాలని, సంబంధిత పోలీసు అధికారులను ఫోన్లో ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిసోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జిల్లా పోలీసు శాఖ ప్రజలకు చేరువగా ఉండి శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.