Kumram Bheem Asifabad: ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు గౌరవప్రదమైనవి
ABN , Publish Date - Aug 06 , 2026 | 11:58 PM
ఆసిఫాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ సంస్కృతీ, సంప్రదా యాలు ఎంతో గౌరవప్రదమైనవని ఎస్పీ నితికాపంత్ అన్నారు.
ఆసిఫాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ సంస్కృతీ, సంప్రదా యాలు ఎంతో గౌరవప్రదమైనవని ఎస్పీ నితికాపంత్ అన్నారు. గురు వారం పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివాసీపటేళ్లు, నాయకులు, గోండ్వానా, రాయిసెంటర్ సర్‌మేడిల సభ్యులతో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో శాంతిభద్రత పరిరక్షణ, ప్రజాసమస్యల పరిష్కారంలో ఆది వాసీ పటేళ్లు, సర్‌మేడిలు కీలకపాత్ర పోషిస్తున్నార న్నారు. జైనూరు ప్రాంతంలో ప్రతివారం ఒకరోజు ప్రత్యేక పోలీసు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం విడుదలచేసిన పోలీ సు నియామకాలకు సంబంధించి జిల్లాలోని నిరు ద్యోగ ఆదివాసీయువతకు జిల్లాపోలీసుశాఖ ఆధ్వ ర్యంలో ప్రత్యేకశిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అనంతరం ఆదివాసీనాయకులను సన్మానించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ అశోక్, ఆదివాసీసంఘం నాయకులు పాల్గొన్నారు.
డీసీఆర్బీ కార్యాలయం తనిఖీ..
జిల్లా పోలీసు కార్యాలయంలోని డిస్ట్రిక్ క్రైం రికార్డ్స్ బ్యూరో కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం ఎస్పీ నితికా పంత్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను కంప్యూటరైజ్డ్ డేటా నిర్వ హణ తదితర అంశాలను పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా విధులు నిర్వహించాలని సూచించారు.