Kumram Bheem Asifabad: ‘ఇందిరమ్మ’ రెండో విడత పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Aug 03 , 2026 | 11:57 PM
ఆసిఫాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి):ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండోవిడత గృహనిర్మాణ పనులు, లబ్ధిదారుల డెస్క్ పరిశీ లన, ఫీల్డ్‌పరిశీలన ప్రక్రి యలను వేగవంతం చేయాలని కలెక్టర్
ఆసిఫాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి):ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండోవిడత గృహనిర్మాణ పనులు, లబ్ధిదారుల డెస్క్ పరిశీ లన, ఫీల్డ్‌పరిశీలన ప్రక్రి యలను వేగవంతం చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్ లో అదనపుకలెక్టర్ యువ రాజ్ మర్మాట్‌తోకలిసి ఎంపీడీవోలు సంబంధిత అధి కారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో10, కెరమెరి మండలం లో 13 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నందున మంగ ళవారం నాటికి డెస్క్‌పరిశీలన పూర్తిచేయాలని అదే శించారు. సిర్పూర్(టి), కౌటాల, బెజ్జూరు, పెంచికల్ పేట, వాంకిడి, లింగాపూర్, రెబ్బెన మండలాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను శనివారం సాయం త్రంలోగా పూర్తిచేయాలన్నారు. బిల్లుల చెల్లింపుల విషయంలో ఎలాంటిసందేహలకు తావులేదని ప్రభు త్వం నుంచి నిధులు సకాలంలో విడుదలవుతాయని లబ్ధిదారులకు అవగాహన కల్పించి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేసే లా చర్యలు తీసుకోవా లని తెలిపారు. సమావే శంలో హౌసింగ్ ప్రాజెక్టు అధికారి ప్రకాష్‌రావు, డీఈ వేణుగోపాల్ పాల్గొ న్నారు.
డిజిటలైజేషన్‌ను
త్వరగా పూర్తి
చేయాలి..
ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని రాష్ట్రఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షసమావేశం నిర్వహించారు. డిజిటలైజేషన్ ప్రక్రియను ఎటువంటి తప్పులు లేకుం డా స్పష్టంగా పూర్తిచేయాలన్నారు. ఒకే కుటుంబాని కి చెందిన సభ్యులను ఒకే పోలింగ్ కేంద్రం కిందకు వచ్చేలా హేతుబద్దీకరణ ప్రక్రియ పకడ్బందీగా చేప ట్టాలన్నారు. కలెక్టర్ హరిత మాట్లాడుతూ జిల్లాలో డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు పాల్గొన్నారు.