Share News

Kumram Bheem Asifabad: గుండాల గ్రామానికి రోడ్డు నిర్మించాలి

ABN , Publish Date - Sep 07 , 2026 | 11:40 PM

ఆసిఫాబాద్‌, సెప్టెం బరు 7 (ఆంధ్రజ్యోతి): తిర్యాణి మండలం గుండాల గ్రామానికి రోడ్డు నిర్మించాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన ప్రజలు పాద యాత్రగా బయలుదేరి శాంతియుతంగా నిర సన తెలిపారు.

Kumram Bheem Asifabad:   గుండాల గ్రామానికి రోడ్డు నిర్మించాలి

ఆసిఫాబాద్‌, సెప్టెం బరు 7 (ఆంధ్రజ్యోతి): తిర్యాణి మండలం గుండాల గ్రామానికి రోడ్డు నిర్మించాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన ప్రజలు పాద యాత్రగా బయలుదేరి శాంతియుతంగా నిర సన తెలిపారు. అనం తరం కలెక్టర్‌ హరితకు వినతిపత్రం అందజేశారు.గ్రామస్తులు మాట్లా డుతూ గ్రామానికి రోడ్డుసౌకర్యం లేకపోవడం తో కనీసం అంబులెన్సులు కూడా రాలేని పరిస్థితి నెలకొందన్నారు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో పాదయాత్రగా నిరసన చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికా రులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు దౌలత్‌రావు, రాందాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2026 | 11:40 PM