Share News

Kumram Bheem Asifabad: వార ‘చింత’

ABN , Publish Date - Jul 05 , 2026 | 11:41 PM

బెజ్జూరు, జూలై 5 (ఆంధ్ర జ్యోతి): వారసంత రూపేణా గ్రామ పంచాయతీకి ప్రతిఏటా లక్షలాది రూపాయలు సమకూ రుతున్నా సంతలో

Kumram Bheem Asifabad: వార ‘చింత’

- వర్షంతో క్రయవిక్రయదారుల అవస్థలు

- కనీసదుపాయాలకు నోచుకోని బెజ్జూరు సంత

బెజ్జూరు, జూలై 5 (ఆంధ్ర జ్యోతి): వారసంత రూపేణా గ్రామ పంచాయతీకి ప్రతిఏటా లక్షలాది రూపాయలు సమకూ రుతున్నా సంతలో కనీస సదు పాయాలు లేక క్రయవిక్రయ దారులు తీవ్రఅవస్థలు పడు తున్నారు. మండలకేంద్రంలో ప్రతిఆదివారం నిర్వహించే వారసంతలో మౌలిక వసతులు లేక అష్టకష్టాలు ఎదుర్కొం టున్నా గ్రామపంచా యతీ అధికారులు ఏమాత్రం పట్టిం చుకోవడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. విక్రయదారులు సంతలో కూర్చోవ డానికి గద్దెలు ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా మొర పెట్టుకుంటున్నా వినే నాథుడే కరువయ్యారని వాపో తున్నారు. ఆదివారం వర్షం కురవడంతో సంతలో అమ్మకానికి తీసు కొచ్చిన సామాగ్రి పూర్తిగా తడిసి ముద్దయిందని వాపోతున్నారు. సంత లో వస్తువులు అమ్మేందుకు వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి కూర గాయలు, బట్టలు, కాస్మోటిక్స్‌, పాత్రలు, ఆటవస్తువులు, ఇతర సామాగ్రిని అమ్ముతుంటారు. ప్రతిఏటా వర్షం కురిస్తే తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని వ్యాపారులు వాపోతున్నారు.

Updated Date - Jul 05 , 2026 | 11:41 PM