Share News

Kumaram Bheem Asifabad: ‘డబుల్‌ రోడు’్డ కష్టాలు

ABN , Publish Date - Jul 06 , 2026 | 11:44 PM

దహెగాం, జూలై 6 (ఆంధ్రజ్యోతి): దహెగాం మండలంలోని కోత్మీరు నుంచి దహెగాం మండల కేంద్రం వరకు నిర్మిస్తున్న డబుల్‌రోడ్డు నిర్మాణ పనులు పూర్తికాక ప్రజలు

Kumaram Bheem Asifabad: ‘డబుల్‌ రోడు’్డ కష్టాలు

- పూర్తి కాని పనులు, దిగబడుతున్న వాహనాలు

- చిన్నపాటి వర్షానికే చిత్తడి

- అవస్థలుపడుతున్న ప్రజలు

దహెగాం, జూలై 6 (ఆంధ్రజ్యోతి): దహెగాం మండలంలోని కోత్మీరు నుంచి దహెగాం మండల కేంద్రం వరకు నిర్మిస్తున్న డబుల్‌రోడ్డు నిర్మాణ పనులు పూర్తికాక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది రూ.31కోట్లతో ఈ పనులను ప్రారంభించారు. నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు ఈ మార్గం గుండా ద్విచక్ర వాహనాలు సైతం పోలేని పరిస్థితి నెలకొంది. భారీ వాహనాలు బురద రోడ్డుపై దిగబడుతున్నాయి. బురద కారణంగా ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులను కూడా రద్దు చేశారు. వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని రోడ్డు పనులు ఇప్పటికే పూర్తి చేస్తే ఈ సమస్యలు వచ్చే కావాలని ఆయాగ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పుడు అత్యవసరమొస్తే తాము దేవుడిపై భారం వేసుకొని కాలం గడపాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు పేర్కొంటున్నారు. కోత్మీర్‌ నుంచి దహెగాం మండల కేంద్రానికి నిత్యం విద్యార్థులు, ఆయాగ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. కనీసం చిన్నపాటి బైక్‌ కూడా పోలేని పరిస్థితి ఏర్పడింది. అత్యవసరమున్న ఐనం, దహెగాం, లగ్గాం, హత్ని, కమ్మర్‌పల్లి, ఒడ్డుగూడ గ్రామ పంచాయతీల ప్రజలు పెంచికల్‌పేట మీదుగా కాగజ్‌నగర్‌ వెళుతున్నారు. దీంతో అదనపు ఖర్చు, సమయం వృథా అవుతోందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేట్టు చూడాలని డిమాండు చేస్తున్నారు. ఈ విషయమై ఆర్‌అండ్‌బీ ఏఈ క్రాంతిని వివరణ కోరగా ఈ పనుల నిర్మాణం విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. పనులు వేగంగా పూర్తయ్యేట్టు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

ఫ ఇబ్బందులు పడుతున్నాం..

- చాంద్‌ పాషా, బీబ్రా

ఈ మధ్య కురిసిన వర్షాలకు డబుల్‌ రోడ్డు అంతా బురదగా మారింది. కనీసం బైక్‌లు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. తొలకరి వర్షాలకే పరిస్థితి ఈ విధంగా ఉంటే, భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలాగుంటుందో చెప్పలేని పరిస్థితి. భారీ వాహనాలు రోడ్డుపైనే కూరుకుపోతున్నాయి. అధికారులు స్పందించి ఈ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి.

వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉంది..

-రవి, ఆటో డ్రైవర్‌, చిన్నఐనం

చిన్నపాటి వర్షానికే డబుల్‌ రోడ్డు పూర్తిగా బురదమయమైంది. ఒక్కసారి ఈ రోడ్డుపై వెళితే చాలు ఆటోలన్నీ అధ్వానంగా తయారవుతున్నాయి. డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులు ఎండాకాలంలోనే పూర్తి చేసి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. ఇప్పటికైనా అధికారులు రోడ్డును త్వరగా పూర్తి చేయాలి.

Updated Date - Jul 06 , 2026 | 11:44 PM