Share News

Kumaram Bheem Asifabad: ఘనంగా వటసావిత్రి పూజలు

ABN , Publish Date - Jun 29 , 2026 | 11:28 PM

ఆసిఫాబాద్‌రూరల్‌/కెరమెరి, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని సోమ వారం వటసావిత్రి వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.

Kumaram Bheem Asifabad:  ఘనంగా వటసావిత్రి పూజలు

ఆసిఫాబాద్‌రూరల్‌/కెరమెరి, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని సోమ వారం వటసావిత్రి వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడ, బజార్‌ వాడి, జన్కాపూర్‌ తదితర కాలనీలలో మర్రి వృక్షానికి మహిళలు ప్రత్యేకపూజలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా మహిళాలు మర్రి వృక్షానికి దారాన్ని చుడుతూ ప్రదక్షణలు చేశా రు. అనంతరం ఒకరికొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. కెరమెరి మండల కేంద్రంలో శివాలయం ఆవరణ లో మహిళలు మర్రి చెట్టుకు వేదపండి తులు బాపుదేవ్‌ కుల కర్ణి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చింతలమానే పల్లి/ బెజ్జూరు/ జైనూరు: మండలం లోని బాపూర్‌ గ్రామంలో, బెజ్జూరు మండలంలో సోమ వారం వటసావిత్రి పూజలు ఘనంగా నిర్వ హించారు. మర్రి వృక్షానికి పసుపు, కుంకుమలు సమర్పించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం వృక్షానికి నూలుదారాన్ని చుడుతూ ప్రదక్షణలు చేశారు. జైనూర్‌ మండల కేంద్రంలోని హనుమాన్‌ మందిరం ఆవరణలో పూజారి కులకర్ణిపండి త్‌ మహరాజ్‌ ఆధ్వర్యంలో మర్రిచెట్టు కింద మహిళలు వటసావిత్రి వ్రతం పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు సాంప్రదాయబద్దంగా మర్రి చెట్టుకు మంగళ హారతులతో పూజలు చేశారు.

Updated Date - Jun 29 , 2026 | 11:30 PM