Kumaram Bheem Asifabad: గెలుపు ఓటములను సవాలుగా తీసుకోవాలి
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:47 PM
ఆసిఫాబాద్ రూరల్, అక్టోబరు 10 (ఆంధ్ర జ్యోతి): క్రీడల్లో, జీవితంలో గెలుపు ఓటములను ఒక సవాలుగా తీసుకొని ముందుకు సాగాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు.
- ఎమ్మెల్యే కోవలక్ష్మి
- అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటిలు
ఆసిఫాబాద్ రూరల్, అక్టోబరు 10 (ఆంధ్ర జ్యోతి): క్రీడల్లో, జీవితంలో గెలుపు ఓటములను ఒక సవాలుగా తీసుకొని ముందుకు సాగాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా నెట్‌బాల్ అసోసియోషన్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఆలీబీన్ అహ్మద్, తిరుపతి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో మూడురోజుల పాటు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సబ్ జూని యర్, జూనియర్‌పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కోవ లక్ష్మి ముఖ్య అతిథిగా హజరై క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. రాష్ట్రస్థాయి పోటీలు జిల్లా కేంద్రంలో నిర్వహించడం అభినందనీయమ న్నారు. క్రీడల్లో జిల్లాజట్లు ఉత్తమప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపిక కావాలన్నారు. నెట్‌బాల్ జిల్లాఅధ్యక్ష,ప్రదాన కార్యదర్శులు ఆలీబీన్ అహ్మద్, తిరుపతి మాట్లాడుతూ జిల్లాకేంద్రంలో మూడు రోజులపాటు జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు అండర్-16, అండర్-19 జట్లు పాల్గొనను న్నాయని 33జిల్లాలకు గాను 24 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నార న్నారు. రాష్ట్రస్థాయి పోటిల్లో రాణించిన జూనియర్‌క్రీడాకారులు డిసెంబర్ నెలలో మహారాష్ట్రలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో, మధ్యప్రదేశ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో సబ్‌జూనియర్ క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం కుమరంభీం ఆసిఫాబాద్, రాజన్నసిరిసిల్ల జట్లు మొదటిమ్యాచ్‌లో తలపడ్డాయి. కార్యక్రమంలో నెట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్య దర్శులు ఆదిత్యరెడ్డి, శిరిషరాణి, మున్సిపల్‌చైర్మన్ అకాష్, వైస్‌చైర్మన్ అహ్మద్, కౌన్సిలర్లు చిలూవేరి వెంకన్న, అబ్దుల్లా, బాలకృష్ణ, సాలం, ప్రిన్సిపాల్ దుర్గం మహేష్, సర్పంచ్ రవిందర్, నాయకులు నిసార్, జీవన్, సమద్, గంధం శ్రీనివాస్, షేక్ కలీం, అమర్ తదితరులు పాల్గొన్నారు.