Share News

Kumaram Bheem Asifabad: ప్రహరీ నిర్మాణాన్ని పకడ్బందీగా చేపట్టాలి

ABN , Publish Date - Jul 06 , 2026 | 11:47 PM

జైనూర్‌, జూలై 6 (ఆంధ్ర జ్యోతి): విద్యార్థుల సౌలభ్యం కోసం చేపడుతున్న ప్రహరీ నిర్మాణపనులను పకడ్బందీగా చేపట్టాలని ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు.

Kumaram Bheem Asifabad:   ప్రహరీ నిర్మాణాన్ని పకడ్బందీగా చేపట్టాలి

జైనూర్‌, జూలై 6 (ఆంధ్ర జ్యోతి): విద్యార్థుల సౌలభ్యం కోసం చేపడుతున్న ప్రహరీ నిర్మాణపనులను పకడ్బందీగా చేపట్టాలని ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని భూసిమెట్ట గిరిజన రెసిడెన్షియల్‌ కాలేజీ ఆవరణలో సోమవారం ఎన్‌ ఆర్‌ఈజీఎస్‌ ద్వారా రూ.34 లక్షలతో చేపడుతున్న ప్రహ రీకి ఆమె, జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌రావ్‌, సర్పం చులు, ప్రజా ప్రతినిధులతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ ప్రహరీ నిర్మాణంతో విద్యార్థు లకు పూర్తిస్థాయి భద్రత ఏర్పడుతుందన్నారు. పనులను సంబంధితశాఖ అధికారులు ఎప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండాలని సూచిం చారు. కార్యక్రమంలో సహకార చైర్మన్‌ కొడప హన్నుపటేల్‌, సర్పంచులు కొడప ప్రకాష్‌, ఆత్రం సింధు నగేష్‌, మండలపార్టీ అధ్యక్షుడు ఇంతియాజ్‌లాల, ఐటీడీఏ ఏఈ రాథోడ్‌ ఇందల్‌, కళాశాల వైస్‌ప్రిన్సిపాల్‌ యశోద, మాజీ సర్పంచ్‌ కోట్నాక మోతుబాయి మాధవ్‌ రావ్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2026 | 11:47 PM