Share News

Kumaram Bheem Asifabad: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తోంది

ABN , Publish Date - Aug 26 , 2026 | 11:49 PM

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్‌ అన్నా రు.

Kumaram Bheem Asifabad:  కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తోంది

-ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి బోగె ఉపేందర్‌

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్‌ అన్నా రు. బుధవారం ఏరియా హాస్పి టల్‌ ఆవరణలో కార్మికులతో కలిసి ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యానికి ముందు 1920అక్టోబర్‌ 31న ఏఐటీ యూసీ ఆవిర్భవించిందని, అప్పటినుంచి ఎన్నో పోరా టాలు, త్యాగాలు చేసిందని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల మేలు కోసమే 29 కార్మికచట్టా లను రద్దుచేసి 4లేబర్‌ కోడ్‌లుగా తయారుచేసిందని ఆరోపించారు. కనీసవేతనం అమలు, 8గంటల పని విధానం, సమానపనికి సమానవేతనం, ఉద్యోగ భద్రత కల్పించి, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్పీఎం ఎన్నికలను వెంటనే జరిపించేలా, పాత కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా డ్యూటీలోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాగజ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడ కల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సెప్టెంబర్‌లో నిర్వ హించే ఏఐటీయూసీ రాష్ట్రమహాసభలు జయప్రదం చేయాలని పిలుపుచిన్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి షాకీర్‌, జంషద్‌, శివం, సాయి, మీనాక్షి, రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2026 | 11:49 PM