Kumaram Bheem Asifabad: నీతి ఆయోగ్‌లోని అంశాలపై పురోగతి సాధించాలి
ABN , Publish Date - Jul 06 , 2026 | 11:46 PM
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): నీతి ఆయోగ్‌లో భాగంగా ఆకాంక్షిత జిల్లా, ఆకాంక్షిత తిర్యాణి బ్లాక్‌లో నిర్దేశించిన అంశాలపై పురోగతి సాధించాలని
- కలెక్టర్ కె హరిత
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): నీతి ఆయోగ్‌లో భాగంగా ఆకాంక్షిత జిల్లా, ఆకాంక్షిత తిర్యాణి బ్లాక్‌లో నిర్దేశించిన అంశాలపై పురోగతి సాధించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్దశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అధి కారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీతి ఆయోగ్‌లో భాగంగా ఆకాంక్షిత జిల్లా, ఆకాంక్షిత తిర్యాణి బ్లాక్‌లో నిర్దేశించిన అంశాలను క్షేత్రస్థాయిలో పూర్తిచేసి పనులలో పురోగతి సాధించాలని తెలిపారు. గర్భిణులు, చిన్నపిల్లల ఆరో గ్యంపై దృష్టి సారించాలని అన్నారు. క్షయ వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి ప్రతి నెల కిట్లను అందించి వ్యాధి నయం అయ్యేలా కృషి చేయాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలోని పిల్లలకు క్రమం తప్పకుండా శ్యామ్ మామ్ కార్యక్రమాలు నిర్వహించి బరువు, ఎత్తు తక్కువగా ఉన్న పిల్లలతోపాటు మానసిక ఎదుగుదల లేని పిల్లలకు పోషకాహారాలు అందించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికవసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని, పాఠశాలలో బాలికల కోసం ప్రత్యేక మూత్రశాలల నిర్మాణాలు, తాగునీరు, విద్యుత్ పనులు చేపట్టాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిం చాలని తెలిపారు. మారుమూల గ్రామాల్లో రహదారి అనుసంధానం, తాగునీరు, ఇంటర్నెట్ సౌకర్యాల కల్ప నపై అధికారులు దృష్టిసారించాలని తెలిపారు. కార్యక్ర మంలో సంబంధిత శాఖల అధికారులు, నీతి ఆయోగ్ జిల్లా సమన్వయ కర్త బాలరాజు తది తరులు పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులను
సత్వరమే పరిష్కరించాలి..
ప్రజావాణికి అర్జీదారులు సమర్పిం చిన దరఖాస్తులను శాఖలవారీగా, క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరి ష్కరించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వ హించిన ప్రజవాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి వేణుతో కలిసి ఆమె అర్జీలు స్వీకరించారు. వాంకిడి మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన శ్యాంరావు తనకు దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేయాలని దరఖాస్తు సమర్పించారు. తిర్యా ణి మండలం అవలగూడ గ్రామానికి చెందిన వెంకటి తనకు గతంలో వస్తున్న పెన్షన్ ఆగిపోయిందని తిరిగి పున రుద్దరించాలని, రెబ్బెన మండలం వంకులం గ్రామానికి చెందిన పార్వతి తన తండ్రిపేరిట గల భూమిని ఇతరులు అక్రమంగా ఆక్రమించుకున్నందున తనకు న్యాయం చేయాలని, కాగజ్‌నగర్ మండలం అంకుశాపూర్ గ్రామానికి చెందిన మురళీబాయి భూమి పట్టా గురించి దరఖాస్తు అందజేశారు. కాగజ్‌నగర్ పట్టణంలోని కాపువాడకు చెందిన శేఖ నాబోతుమ్మ తమకాలనీలో గలరహదారిని ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేస్తున్నందున చర్యలు తీసుకోవాలని, తిర్యాణి మండలం, బింబీనిగూడ గ్రామానికి చెందిన పెద్దరాజు తమ పట్టాభూమిలో ఎలాంటి ఒప్పందం లేకుండా పాఠశాల భవనం నిర్మాణం చేపట్టడంపై తగిన చర్యలు తీసుకోవాలని, కాగజ్‌నగర్ మండలం గువ్వలగూడ గ్రామానికిచెందిన గోవింద్‌లాల్ తమ పట్టా భూమి విరాళంగా పోయిందని నష్టపరిహారం ఇప్పించాలని దరఖాస్తు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హులైన ప్రతిఒక్కరికి న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.