Share News

Kumaram Bheem Asifabad: విద్యుత్‌లైన్ల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తప్పనిసరి

ABN , Publish Date - Aug 31 , 2026 | 11:30 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): అటవీప్రాంతాల్లో విద్యు త్‌లైన్ల ఏర్పాటుకు ముందస్తు అనుమ తులు తప్పనిసరి అని, అటవీ, విద్యుత్‌ అటవీశాఖలు సమన్వయంతో పనిచే యాలని జిల్లాఅటవీశాఖ అధికారి బాలమణి అన్నారు.

Kumaram Bheem Asifabad:  విద్యుత్‌లైన్ల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తప్పనిసరి

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): అటవీప్రాంతాల్లో విద్యు త్‌లైన్ల ఏర్పాటుకు ముందస్తు అనుమ తులు తప్పనిసరి అని, అటవీ, విద్యుత్‌ అటవీశాఖలు సమన్వయంతో పనిచే యాలని జిల్లాఅటవీశాఖ అధికారి బాలమణి అన్నారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ ఉత్తమ్‌జాడే, కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీవో బార్గవ్‌కుమార్‌తో పాల్గొని మాట్లాడా రు. జిల్లాలోని పలు అటవీప్రాంతాలలో అను మతులు లేకుండా విద్యుత్‌లైన్లు ఏర్పాటు చేసి ఉన్నట్లు గుర్తించామన్నారు. వాటికి సంబంధిం చి అవసరమైన అనుమతుల కోసం తగిన ప్రతిపాదనలు వెంటనే పంపించాలని విద్యుత్‌ శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలోని అటవీప్రాంతాలు కవ్వాల్‌ టైగర్‌రిజర్వ్‌ పరిధిలో ఉన్నందున అటవీశాఖ అనుమతులు లేకుండా కొత్త విద్యుత్‌లైన్లు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు.

అటవీప్రాంతాల్లో ఏర్పాటు చేసే విద్యుత్‌ లైన్లకు రబ్బర్‌ ఇన్సులేటెడ్‌ కవర్లు, ప్రత్యేక తొడుగులు ఏర్పాటు చేయాలని సూచిం చారు. విద్యుత్‌లైన్ల వల్ల వన్యప్రాణులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించా లన్నారు. సమావేశంలో విద్యుత్‌, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2026 | 11:30 PM