Share News

Kumaram Bheem Asifabad: పీఆర్సీని ప్రకటించాలి

ABN , Publish Date - Aug 26 , 2026 | 11:48 PM

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 3సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని వెంటనే ప్రకటించాలని పీఆర్టీయూ టీఎస్‌

Kumaram Bheem Asifabad:   పీఆర్సీని ప్రకటించాలి

-పీఆర్‌టీయూ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్‌ రెడ్డి

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 3సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని వెంటనే ప్రకటించాలని పీఆర్టీయూ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్‌ రెడ్డి డిమాండ్‌చేశారు. బుధవారం పద్మశాలి భవన్‌లో నిర్వహించిన జిల్లా సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్‌రెడ్డ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి మహేందర్‌రెడ్డి మాట్లాడారు.

పెండింగ్‌ డీఎల్‌ విడుదల చేయాలని, సీపీఎస్‌ రద్దుచేయాలని, రేషనలైజేషన్‌ జీవో నంబరు 25ను సవరించాలని, అన్ని పాఠశాలలను బలోపేతం చేయాలని, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీచేయాలని బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని, తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. అనంతరం 2026-27సంవత్సరానికి నూతన జిల్లాకార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2026 | 11:48 PM