Kumaram Bheem Asifabad: ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 29 , 2026 | 11:26 PM
ఆసిఫాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణికి వస్తున్న ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని
- కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణికి వస్తున్న ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలె క్టర్ కె హరిత సూచించారు. కలెక్టరేట్‌లో జిల్లా అదనపుకలెక్టర్‌లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి వేణుతో కలిసి ఆమె ప్రజలనుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులు ఎక్కడ కూడా పెండింగ్ లేకుం డా చూడాలన్నారు. శాఖలవారీగా ఎప్పటికప్పుడు రిపోర్టులు పంపిం చాలని ఆదేశించారు. ప్రజవాణిలో భాగంగా సిర్పూర్(టి) మండలం లక్ష్మీపూర్ బెంగాళీ క్యాంపునకు చెందిన మండల్ తనకు దివ్యాంగ పెన్షన్ ఇప్పించాలని, తిర్యాణి మండలం గోయగాంకు చెందిన జంగు తనభూమి ఇతరులు అక్రమంగా కబ్జాచేసుకుని సాగు చేస్తున్నారని తనకు న్యాయం చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని ఓల్డ్ కాలనీకి చెందిన మహమూద్ ఫాతిమా తనకు 14వవార్డులో అంగన్‌వాడీ టీచర్‌గా బదిలీచేయాలని కోరారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌కు చెందిన దుర్గాబాయి తనకు అనుమతి లేకుండా తన భూమిలో విద్యుత్ స్తంభాలు వేశారని ఫిర్యాదు చేశారు. రెబ్బెన మండలం రాజారాం గ్రామానికి చెంది అంజయ్య తాను సాగు చేసుకుంటున్న భూమికి అటవీఅధికారులు అడ్డుపడుతున్నారని తనకు న్యాయం చేయాలని కోరారు. ఆసిఫాబాద్ మండలం అప్పపల్లి గ్రామా నికి చెందిన కోట మొండయ్య తనకు చెందిన భూమి ఓపెన్ కాస్టు గనిలో పోయిందని తనకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ఇంటి స్థలం ఇవ్వాలని కోరారు.