Kumaram Bheem Asifabad: కొనసాగుతున్న వైద్య విద్యార్థుల నిరసన
ABN , Publish Date - Nov 19 , 2026 | 11:58 PM
ఆసిఫాబాద్‌రూరల్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు చేపడుతున్న నిరసన నాలుగురోజులకు చేరు కుంది.
ఆసిఫాబాద్‌రూరల్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు చేపడుతున్న నిరసన నాలుగురోజులకు చేరు కుంది. బుధవారం రాత్రి కళాశాల ఆవరణలోనే నిద్రించి గురువారం కళాశాల ఎదుట బైఠాయించి పాలిథీన్ కవర్లను తలపై, ముఖా నికి ధరించి వినూత్నరీతిలో నిరసన వ్యక్తంచేశారు. వైద్యకళా శాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేసిన వెంకట్ ఆదిలాబాద్ రిమ్స్‌కు బదిలీ కాగా ఆయన స్థానంలో గతంలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించి ప్రస్తుతం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్రీలక్ష్మికి ఇన్‌చార్జీ ప్రిన్సిపాల్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్నారు. తాజాగా ప్రిన్సిపాల్‌గా మహేష్‌ను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా శ్రీలక్ష్మిని కళాశాల విధుల నుంచి తొల గించి వేరే చోటికి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనను కొనసాగిస్తున్నారు. గతంలో ప్రిన్సిపాల్‌గా పనిచేసిన శ్రీలక్ష్మి ప్రాక్టికల్ పరీక్షల్లో కక్షపూరితంగా వ్యవహరించి తక్కువ మార్కులు వేశారని దీంతో ఆ సంవత్సరంలో అనేకమంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి కూడా ఆమె ప్రవర్తన మారలేదని ఉన్నతాధికారులు స్పందించి ఆమెను వైద్యకళాశాల విధుల నుంచి తప్పించి మరోచోటికి బదిలీచేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు.