Kumaram Bheem Asifabad: రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Aug 31 , 2026 | 11:57 PM
ఆసిఫాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్డుప్రమాదాలు జరగకుండా రక్ష ణచర్యలు చేపట్టాలని కలెక్టర్ కె హరిత అన్నారు.
ఆసిఫాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్డుప్రమాదాలు జరగకుండా రక్ష ణచర్యలు చేపట్టాలని కలెక్టర్ కె హరిత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎస్పీ నితికాపంత్, అదనపుకలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తోకలిసి రోడ్డుభద్రతపై అధికారు లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తర చూప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తిం చి వేగనియంత్రణలు, సూచికబోర్డులు ఏర్పాటు చేయా లన్నారు. సిర్పూర్(టి) మండలంలోని వెంకట్రావ్‌పేట వద్దగల అంతర్‌రాష్ట్ర వంతెనపై భారీవాహనాలు వెళ్ల కుండా చర్యలు తీసుకోవాలన్నారు. రహదారులపై పశు వులు సంచరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకో వాలన్నారు. మరోసమావేశంలో జిల్లాలో మాదకద్ర వ్యాల నియంత్రణ దిశగా అధికారులు పకడ్బందీ చర్య లు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. ఈ సంవత్సరంలో గం జాయివిక్రయం వినియోగంపై మూడుకేసులు నమోదు చేశామని గంజాయి సాగుచేసిన 36మంది రైతులకు రైతుభరోసా నిలిపివేయడం జరిగిందన్నారు. విద్యాసం స్థల పరిధిలో వందమీటర్లలోపు పాన్, కిరాణా, బెల్ట్ షాపులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావే శాల్లో ఆర్డీవోలు లోకేశ్వర్‌రావు, కృష్ణయ్య, డీఎస్పీ అశోక్, సంబందితశాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫ రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి..
జిల్లాలో గ్రామనక్షలు లేని గ్రామాల రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి మండల సర్వేయర్లతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వేను జిల్లాలో పకడ్బందీగా చేపట్టాలని.. ప్రక్రియ త్వరగా పూర్తి చేసేలా పనులను వేగవంతం చేయాలని తెలిపారు. భవిష్యత్‌లో రైతుల మధ్య ఎలాంటి భూ వివాదాలు ఉండకూడదని అన్నారు. సర్వేలో డీజీపీఎస్, రోవర్స్‌లను ఉపయోగించాలన్నారు. సమావేశంలో సర్వే లాండ్ రికార్డు ఏడీ వినయ్‌కుమార్, మండల సర్వేయర్లు పాల్గొన్నారు.
ఫ విముక్త జాతుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేక చర్యలు..
జిల్లాలో విముక్త జాతుల ప్రజల సంక్షేమం, విద్య, వైద్యం, అభివృద్ధికి ప్రత్యేకచర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విముక్తజాతుల దినోత్సవ కార్యక్రమా నికి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం విముక్త జాతుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. వారికి గూడు కల్పించేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తింపచేయడంతో పాటు పిల్లలకు విద్య, ఆరోగ్యంపై ప్రత్యేకదృష్టి సారిస్తున్నామ న్నారు. విముక్తజాతులవారు తమ సంప్ర దాయ వృత్తులు, కళలు, జానపద ప్రదర్శ నలు, జీవనవిదానాలు తెలంగాణ సంస్కృతికి ఎంతోవిలువైన సంపదని పేర్కొన్నారు. సమా వేశంలో అదనపుకలెక్టర్లుయువరాజ్ మర్మాట్, డేవిడ్, డీఆర్వో వేణు, జిల్లా బీసీ సంక్షేమాధికారి నదీం, డీడీ అంబాజీ తదితరులు పాల్గొన్నారు.
ఫ విద్యార్థులు వందశాతం పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి..
విద్యార్థులు వందశాతం ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలె క్టర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జూమ్‌మీటింగ్ ద్వారా జిల్లాలోని ఎంఈవోలు, విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాలు 627పాఠశాలల్లో అమలు చేయడం జరుగుతున్నదన్నారు. విద్యార్థులకు ప్రాథమిక దశలోనే విషయాల వారీగా నాణ్యమైన విద్యాబోధన అందించా లన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి క్రమం తప్పకుండా పాఠశాలలకు విద్యార్థులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో అదనపుకలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఈవో సచ్చిదానందచారి, విద్యా శాఖ అధికారులు శ్రీనివాస్, అబీద్‌ఆలీ, ఎంఈవోలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.