Kumaram Bheem Asifabad: శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Aug 31 , 2026 | 11:32 PM
ఆసిఫాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): పోలీసు ఉద్యోగం సాధించాలన్న లక్ష్యం పెట్టుకున్న ప్రతి అభ్యర్థి 90 రోజుల శిక్షణను ఒకగొప్ప అవ కాశంగా భావించి సద్విని యోగం చేసుకోవాలని ఎస్పీ నితికాపంత్ అన్నారు.
ఆసిఫాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): పోలీసు ఉద్యోగం సాధించాలన్న లక్ష్యం పెట్టుకున్న ప్రతి అభ్యర్థి 90 రోజుల శిక్షణను ఒకగొప్ప అవ కాశంగా భావించి సద్విని యోగం చేసుకోవాలని ఎస్పీ నితికాపంత్ అన్నారు. సోమ వారం పోలీసునియామకాల ఉచితశిక్షణశిబిరం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో 90రోజుల పాటు 160మంది అభ్యర్థులకు ఉచిత పోలీసు శిక్షణ అందిస్తామన్నారు. ఫిజికల్ ట్రెనింగ్‌తో పాటు ప్రిలిమ్స్, మెయిన్స్ విషయ పరిజ్ఞానం లో ప్రత్యేకశిక్షణ అందిస్తామన్నారు. క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, నిరంతర సాధనతో ముందుకుసాగి లక్ష్యాన్ని నేరవేర్చుకోవాలన్నా రు. సమావేశంలో డీఎస్పీ అశోక్, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.
30పోలీసు యాక్ట్ అమలు..
జిల్లా వ్యాప్తంగా సెప్టెంబరు 1 నుంచి సెప్టెంబరు 30వరకు 30పోలీసు యాక్ట్ అమ లులో ఉంటుందని ఎస్పీ నితికాపంత్ అన్నారు. ముందస్తు అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.