Kumaram Bheem Asifabad: తెలంగాణను పాలిస్తున్నది చంద్రబాబే..
ABN , Publish Date - Jul 05 , 2026 | 11:43 PM
కాగజ్‌నగర్, జూలై 5 (ఆంధ్ర జ్యోతి): తెలంగాణ రాష్ట్రాన్ని పాలించేది, తోలుబొమ్మగా ఆడించేది ఎపీ సీఎం చంద్రబాబే అని
- బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
కాగజ్‌నగర్, జూలై 5 (ఆంధ్ర జ్యోతి): తెలంగాణ రాష్ట్రాన్ని పాలించేది, తోలుబొమ్మగా ఆడించేది ఎపీ సీఎం చంద్రబాబే అని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఆదివారం సిర్పూరు స్వెరోస్ ఆధ్వర్యంలో 120మందికి అజీమ్‌ప్రేంజీ స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, బీజేపీ సాయంతో తెలంగాణను దోచుకోవాలని చూస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలను అడ్డుకోవాలని చూస్తుంటే తట్టుకోలేకపోతున్నారన్నారు. కాళేశ్వరం నీళ్లు ఆంధ్రకు తరలిపోతుంటే రేవేంత్‌రెడ్డి చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కేవలం కుంభకోణాలకే పరిమితమైందన్నారు. రైతుల కోసం పోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ నాయకులను కావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. తనను చంపాలని కుట్ర పన్నుతున్నారని, తన కుటుంబాన్ని కూడా వదలటం లేదని పేర్కొన్నారు. సిర్పూరు నియోజకవర్గ విద్యార్థినులకు ఏటా రూ.30వేలు స్కాలర్‌షిప్ అందుతుందని, ఇందుకు సహకరించిన అజీమ్‌ప్రేంజీ ఫౌండేషన్‌కి కృతజ్ఙతలు తెలిపారు. కార్యక్రమంలో స్వేరోస్ జిల్లా నాయకులు డోంగ్రి సురేష్, కోఆర్డినేటర్ మమత, స్థానిక నాయకులు మినాజ్, రాజు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.