Kumaram Bheem Asifabad: స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
ABN , Publish Date - Aug 13 , 2026 | 11:53 PM
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఈనెల 15వ తేదిన 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఈనెల 15వ తేదిన 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌పరేడ్ మైదానాన్ని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్వో వేణు, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేడుకలలో భాగంగా వేదిక అలంకరణ, ప్రముఖులు, మీడియాగ్యాలరీ, అధికారులు, ప్రజలు కూర్చునే గ్యాల రీలలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. షామియానాలు, కుర్చీలు, సౌండ్ సిస్టం, స్టాల్ ఏర్పాటు స్థలం, విద్యార్థుల నృత్య ప్రద ర్శన స్థలాన్ని చదునుచేయాలని అధికారులకు సూచించారు. ఎలాం టి అసౌర్యం కలగకుండా తాగునీరు, నిరంతర విద్యుత్‌సరఫరా, పారిశుధ్య పనులు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధి కారులు నదీమ్, సురేష్, సిద్దిఖీ, ఎమ్మార్వో రియాజ్‌ఆలీ తదితరులు పాల్గొన్నారు.