Kumaram Bheem Asifabad: అనార్‌పల్లి వాగుపై వంతెన నిర్మాణానికి కృషిచేస్తా
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:42 PM
కెరమెరి, జూలై 20 (ఆంధ్ర జ్యోతి): అనార్‌పల్లి వాగుపై వం తెన నిర్మానానికి కృషిచేస్తానని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తెలిపారు.
కెరమెరి, జూలై 20 (ఆంధ్ర జ్యోతి): అనార్‌పల్లి వాగుపై వం తెన నిర్మానానికి కృషిచేస్తానని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తెలిపారు. సోమ వారం అనార్‌పల్లి వాగును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో వాగుఉధృతంగా ప్రవహించటంతో అనార్‌పల్లి, పరిసర గ్రామాల ప్రజలకు రాక పోకలకు తీవ్రఇబ్బంది ఏర్పడు తోందని గ్రామస్థులు సుగుణక్కకు తెలిపారు. దీంతో ఆమె ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు.
ఎస్‌ఐఆర్‌ను వేగవంతం చేయాలి..
ఎస్‌ఐఆర్‌ను వేగవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. స్థానికంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఆమెపరిశీలించారు. ఈసందర్భంగా మాట్లా డుతూ ప్రతిఓటరు ఓటరుజాబితాలో పేరు ఉండేట్టు బీఎల్‌ఎలు, కాంగ్రెస్‌కార్యకర్తలు చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పం చులు అముల్, భీంరావు, శంకర్, బీఎల్‌ఎలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.