Kumaram Bheem Asifabad: యువత జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం
ABN , Publish Date - Sep 05 , 2026 | 11:56 PM
ఆసిఫాబాద్ రూరల్, సెప్టెం బరు 5 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం యువత జీవితాలతో ఆడుకుంటున్నదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి మండిపడ్డారు.
ఆసిఫాబాద్ రూరల్, సెప్టెం బరు 5 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం యువత జీవితాలతో ఆడుకుంటున్నదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి మండిపడ్డారు. శనివారం బీఆర్‌ఎస్ పోరుబాట నిరసన కార్యక్రమంలో భాగంగా జిలా ్లకేంద్రంలో యువత, విద్యార్థుల తోకలిసి భారీర్యాలీ నిర్వహిం చారు. అనంతరం ఆమె మాట్లా డుతూ పెండింగ్‌లో ఉన్న ఫీజు రీఎయింబర్స్‌మెంటును వెంటనే విడుదల చేయాలన్నారు. జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించా లన్నారు. యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ లను వెంటనే అమలుచేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఆకాష్, అహ్మద్, పీఏసీఎస్ చైర్మన్ అలీబీన్ అహ్మద్,కౌన్సిలర్లు వెంకన్న, బాలకృష్ణ, సర్పంచ్ బుర్స పోచయ్య, నాయకులు సరస్వతి, అహ్మద్ బీన్ అబ్దుల్లా, శ్రీనివాస్, నిసార్, లక్ష్మి, అన్సార్, శ్యాం, జీవన్, ఆశోక్, నారాయణ పాల్గొన్నారు.