Kumaram Bheem Asifabad: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:07 AM
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ నియోజక వర్గంలోని గిరిజనప్రాంతాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ నియోజక వర్గంలోని గిరిజనప్రాంతాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. శనివారం హైదరాబాద్ లో గిరిజనసంక్షేమ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఏజెన్సీలోని గిరిజనులకు ఉద్యోగాలలో 75శాతం రిజర్వేషన్ కల్పించా లన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు రాబోయే చలికాలంలో వేడినీటి సదుపాయం కోసం గీజర్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో పనిచేస్తున్న సీఆర్టీలకు ఉద్యోగభద్రత కల్పించాలని కనీసవేతన స్కేలు అమలు చేయాలన్నారు. నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్నరోడ్లు, కల్వర్టు నిర్మాణపనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచే యాలన్నారు. గిరివికాసం పథకం కింద మంజూరైన బోర్‌వెల్‌లకు మోటార్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.