Share News

Kumaram Bheem Asifabad: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలి

ABN , Publish Date - Oct 05 , 2026 | 11:12 PM

ఆసిఫాబాద్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): అర్హు లందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని రెవె న్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి అన్నారు.

Kumaram Bheem Asifabad:   అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలి

ఆసిఫాబాద్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): అర్హు లందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని రెవె న్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్‌ జిల్లాకేంద్రం లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని రెవెన్యూ, గృహనిర్మాణశాఖలపై జిల్లా ఇన్‌చార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశానికి ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ కలెక్టర్లు, ఐటీడీఏ పీవో మంద మకరందు పాల్గొని ఆయా జిల్లాలోని రెవెన్యూ, గృహనిర్మాణశాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్ర మాలు, ప్రజలకు అందుతున్న సేవలు మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూశాఖకు సంబం ధించిన పెండింగ్‌ దరఖాస్తులు, భూసమస్యలు, ధర ణి, భూరికార్డుల అంశాలు, పట్టాదార్‌ పాస్‌ పుస్త కాలు, భూహక్కులు తదితర దరఖాస్తుల పరిష్కా రంపై ప్రత్యేకదృష్టిపెట్టాలని అధికారులను ఆదేశిం చారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా నిర్ణీతగడువులోగా దరఖాస్తులను పరిష్క రించాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా అధికారులు సమన్వ యంతో పనిచేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణంలో అటవీ సమస్యలుంటే సంబందితశాఖల అధికారులు కృషి చేయాలన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇంటికలను సాకారం చేయ డమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సమావేశంలో ఆసిఫా బాద్‌ కలెక్టర్‌ హరిత, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ముఖ్య కార్యదర్శి లోకేష్‌ కుమార్‌, రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హన్మంతు, గృహనిర్మాణ ప్రత్యేక కార్యదర్శి గౌతం, ఎమ్మెల్మీ దండెవిఠల్‌, ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, పాల్వాయి హరీష్‌బాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2026 | 11:12 PM