Kumaram Bheem Asifabad: బీటీ రోడ్డు మంజూరుకు కృషి
ABN , Publish Date - Aug 13 , 2026 | 11:52 PM
సిర్పూరు(టి), ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): సిర్పూరు(టి) మండలం వెంకట్రావుపేట నుంచి నవేగాం ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు నూతన బీటీ రోడ్డు మంజూరుకు కృషి చేయనున్నట్టు
- సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు
సిర్పూరు(టి), ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): సిర్పూరు(టి) మండలం వెంకట్రావుపేట నుంచి నవేగాం ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు నూతన బీటీ రోడ్డు మంజూరుకు కృషి చేయనున్నట్టు సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు తెలిపారు. సిర్పూరు(టి) రైతువేదిక లో గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన బీటీ రోడ్డు, బైపాస్‌రోడ్డు నిర్మిస్తామని పేర్కొ న్నారు. అలాగే సిర్పూరు(టి) భారీవాహనాలు వెళ్లకుండానే సిర్పూరు బస్టాండుకు చేరుకోవచ్చని తెలిపారు. ఇదివరకే సగం రోడ్డు ప్రధాన మంత్రి గ్రామీణసడక్ యోజన కింద మంజూరైందని తెలిపారు. సిర్పూరు(టి) సామాజికఆసుపత్రిలో నాలుగు మెడికల్ ఆఫీసర్లతో పాటు కొత్తగా ఎముకల వైద్యులు విధుల్లోకి చేరారని, మెరుగైన వైద్యసేవలను ప్రజలు సద్వినియోగంచుకోవాలని కోరారు. ప్రయి వేటు ఆసుపత్రులకు దీటుగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తు న్నట్టు ప్రకటించారు. అనంతరం ఆయాశాఖల అధికారులు తమ నివేదికలను చదివి విన్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ షరీ ఫోద్దీన్, సర్పంచ్ నాగమణి, ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాస్, ఎంపీవో బోడ వినోద్, స్పెషల్ అధికారి ధర్మేందర్, వివిధగ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీకార్యదర్శులు పాల్గొన్నారు.